Telangana Assembly: కేటీఆర్‌ సంచలనం.. తొలిసారి రేవంత్‌ రెడ్డికి సంపూర్ణ మద్దతు

KTR Supports To Revanth Reddy Decision In Assembly: రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన మాజీ మంత్రి కేటీఆర్‌ తొలిసారి రేవంత్‌ రెడ్డికి మద్దతు తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం. ఆ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 30, 2024, 03:30 PM IST
Telagnana Assembly: కేటీఆర్‌ సంచలనం.. తొలిసారి రేవంత్‌ రెడ్డికి మద్దతు

KTR Speech: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు కూడా ఢిల్లీలో స్మారకం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విషయంపై అసెంబ్లీ తీర్మానం చేయాలని కేటీఆర్‌ కోరారు. సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా మన్మోహన్ సింగ్ పేరుపొందారని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: Love Marriage: ప్రేమ వివాహం.. కొత్త అల్లుడిపై మామ బీర్‌ బాటిల్‌తో దాడి

ఇటీవల తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్‌ సింగ్‌ సేవలను కొనియాడుతూనే తమ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మన్మోహన్‌ సింగ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మన్మోహన్‌ మృతికి తమ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని.. కేసీఆర్‌ కూడా అతడి సేవలను శ్లాఘించారని చెప్పారు.

Also Read: K Kavitha: కేటీఆర్‌ ఫార్ములా ఈ కారు కేసు నుంచి నిప్పు కణికలా బయటకు వస్తారు

'ప్రపంచం మొత్తం భారతదేశం గురించి వినాల్సి వస్తుందని తన తొలి బడ్జెట్ ప్రసంగంలో భారతదేశ స్థితిగతులను 1991లో తెలిపిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలను భారతదేశం సాధించింది. సింపుల్ లివింగ్ - హై థింకింగ్ అనే జీవన విధానానికి మన్మోహన్ సింగ్ పర్యాయపదం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. నిజాయతీ, నిబద్ధత అనేది ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. అలాంటిది మన్మోహన్‌ సింగ్‌లో కనిపించింది' అని గుర్తుచేశారు.

'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మన్మోహన్ సింగ్‌తో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాఖల కేటాయింపుల్లో వచ్చిన చిక్కుముడిని కేసీఆర్ తనకు కేటాయించిన షిప్పింగ్ శాఖను డీఎంకే పార్టీకి వదులుకొని తీర్చారు. తనకు శాఖలు ముఖ్యం కాదని.. తెలంగాణ ఏర్పాటు ముఖ్యమంటూ స్వయంగా షిప్పింగ్ శాఖ డీఎంకేకు ఇవ్వాలని కేసీఆర్‌ కోరారు. తెలంగాణ కోసం మిమ్మల్ని ఒక కర్మయోగిగా మారుస్తుందని ఆరోజు మన్మోహన్ సింగ్ కేసీఆర్ గురించి అన్నారు' అని కేటీఆర్‌ వివరించారు.

'సమయం వచ్చినప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఒక అంశాన్ని.. ఒక వ్యక్తిని ఆపలేదనేది మన్మోహన్ సింగ్ నాయకత్వం సూచిస్తుంది. ఇదే తెలంగాణ అంశానికి కూడా వర్తిస్తుంది. తెలంగాణ కల సాకరమయ్యే రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్‌. తాను మౌనంగా ఉండి.. ఎన్ని నిందలు వేసినా సంస్కరణలను అద్భుతంగా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన్మోహన్ సింగ్' అని కేటీఆర్‌ గుర్తుచేశారు.

'మన్మోహన్ సింగ్‌కు దక్కిన గౌరవప్రదమైన వీడ్కోలు మన పీవీ నరసింహారావుకు దక్కలేదనే బాధ కొంత కలిగింది. మన్మోహన్‌ సింగ్‌ను రాజకీయాలకు తీసుకొచ్చి దేశానికి అందించిన పీవీకి ఢిల్లీలో ఒక స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో పీవీకి స్మారకం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి' అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News