Do You Know Taraka Ratna Original Name: నందమూరి హీరోలలో ఒకరైన నందమూరి తారకరత్న కన్నుమూయడంతో నందమూరి అభిమానులందరిలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలిపోయిన ఆయన 23 రోజుల పాటు చికిత్స తీసుకొని చివరికి కోలుకోలేక కన్నుమూశారు. అయితే ఆయన అసలు పేరు తారకరత్న కాదని తాజాగా వెల్లడైంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తారకరత్న ప్రస్తావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ఇంట్లో అందరూ ఓబు ఓబు అని పిలిచేవారని ఆయన అన్నారు. కానీ తన అసలు పూర్తి పేరు ఏమిటో ఆయన చెప్పలేదు. కానీ ఆయన మృతి చెందిన నేపథ్యంలో మాదాల రంగారావు కుమారుడు మాదాల రవి ఈ విషయాన్ని బయట పెట్టారు. ప్రోగ్రెసివ్ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మాదాల రంగారావు కుమారుడైన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేదట. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కలిసి మాట్లాడుకునే వాళ్లమని ఆయన చెబుతున్నారు.


టాలీవుడ్ తరపున సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడే సమయంలో కూడా మాదాల రవి తారకరత్న ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఉండే వారమని చిన్నప్పుడు నుంచి కలిసి పెరగడంతో తమ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తారకరత్న చిన్నప్పటి నుంచి నాకు పరిచయం అని పేర్కొన్న మాదాల రవి మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని ఇండస్ట్రీ వాళ్లకు అభిమానులకు అతని పేరు తారకరత్న అని తెలుసు కానీ నిజానికి అతని పేరు ఓబులేసు అని అన్నారు.


మేము ఓబు ఓబు అని పిలిచేవాళ్ళం అని మాదాల రవి పేర్కొన్నారు. ఇక తాను స్వయంగా ఒక డాక్టర్ని కానీ తారకరత్న తనకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందనే విషయాన్ని ఆయన ఎప్పుడూ తనతో పంచుకోలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు, ఇక తారకరత్న అంత్యక్రియలకు బాలకృష్ణ ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని మాదాల రవి మీడియాతో పంచుకున్నారు. రేపు సాయంత్రం మూడున్నర గంటల తరువాత నందమూరి బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం మేరకు ఆయన అంత్యక్రియలు ప్రారంభమవుతాయని, మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని మాదాల రవి చెప్పుకొచ్చారు. 


Also Read: Taraka Ratna Children: తారకరత్నకు కుమార్తె మాత్రమే కాదు.. ఒక వారసుడు కూడా ఉన్నాడు తెలుసా?


Also Read: Curse on Nandamuri Family: నందమూరి కుటుంబానికి శాపం.. నాలుగేళ్ల వ్యవధిలోనే మరణాలు అందుకేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook