Hero Tarun says Iam not a part of Mahesh Babu and Trivikram movie SSMB28: సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేష‌న్‌లు ఉంటాయి. ఆ కాంబో సినిమా వస్తుందంటే.. అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. టాలీవుడ్‌లో అలాంటి కాంబోనే సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది. వీరిద్దరూ ఇదివరకు రెండు సినిమాలు చేశారు. 2005లో వచ్చిన అతడు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ అందుకోగా.. 2010లో వచ్చిన ఖలేజా పర్వాలేదనిపించింది. ఇప్పుడు మూడోసారి మ‌హేశ్-త్రివిక్ర‌మ్ కలిసి పనిచేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ రూపొందిస్తున్న SSMB28 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని సంప్రదించినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా తరుణ్ స్పందించి ఓ క్లారిటీ ఇచ్చారు. తనను SSMB28 సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు సంబంధించి ఏ వార్త అయినా స్వయంగా తానే అభిమానులతో పంచుకుంటానని తరుణ్ చెప్పుకొచ్చారు.


సాధారణంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తన సినిమాల్లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్‌ హీరోలు, హీరోయిన్స్‌ని తీసుకుంటారు. ఈ క్రమంలోనే SSMB28 సినిమా కోసం టాలీవుడ్ లవర్‌ బాయ్‌ తరుణ్‌ని తీసుకోనున్నట్లు టాక్‌ వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. త్రివిక్రమ్‌, తరుణ్‌ కలిసి 'నువ్వే నువ్వే' సినిమా చేశారు. ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే త్రివిక్రమ్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 


Also Read: Rishabh Pant: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రిషబ్ పంత్‌కు స్థానం లేదు: మాజీ సెలక్టర్


Also Read: Ravindra Jadeja Dead Rumour: నేను చనిపోయాననే వార్త కూడా చూశా: రవీంద్ర జడేజా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి