Ravindra Jadeja says I had once read that I have died: కెరీర్‌లో ఎన్నో వదంతులు వస్తుంటాయని, వాటన్నింటిని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. తనపై ఇప్పటికే ఎన్నో వదంతులు వచ్చాయని, ఓసారైతే తాను చనిపోయాననే వార్త కూడా వైరల్ అయిందని చెప్పాడు. ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. 29 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సుల సాయంతో 35 పరుగులు చేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన జడ్డు విలువైన రన్స్ చేశాడు.
ఆసియా కప్ 2022లో భాగంగా నేడు హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రవీంద్ర జడేజా మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తోన్న వదంతుల గురించి స్పందించాడు. 'నాపై ఇటీవలి కాలంలో ఎన్నో వదంతులు వచ్చాయి. ఛాతి కండరాల గాయం కారణంగా ఐపీఎల్ 2022 నుంచి మధ్యలోనే వైదొలిగా. ఆ తర్వాత మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. నాకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో విభేదాలు వచ్చాయని, నేను జట్టును వీడుతున్నా అని రాశారు' అని జడేజా తెలిపాడు.
'టీ20 ప్రపంచకప్ నుంచి కూడా నన్ను తప్పించారని సోషల్ మీడియాలో రాశారు. ఒకసారి నేను చనిపోయాననే వదంతు కూడా వచ్చింది. ఇంతకంటే పెద్ద వదంతేమైనా ఉంటుందా?. ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నేను కేవలం ఆట మీదే దృష్టి పెడతా. భారత దేశం కోసం ఎలా ఆడాలన్నదే నా లక్ష్యం. టీమిండియా కోసం నేను ఏం మెరుగుపర్చుకోవాలో చూసుకుంటా' అని రవీంద్ర జడేజా చెప్పాడు. గత మే నెలలో సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ రవీంద్ర జడేజా మృతి చెందిన తర్వాత జడ్డూపై వదంతులు వచ్చిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2022కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బాధ్యతల నుంచి ఎంఎస్ ధోనీ తప్పుకొవడంతో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. జడ్డూ సారథ్యంలో చెన్నై వరుస ఓటములను ఎదుర్కొంది. మరోవైపు ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు. దీంతో జట్టు బాధ్యతలను తిరిగి ధోనీకే అప్పగించాడు జడేజా. ఈ ఘటన తర్వాత చెన్నైతో జడేజాకు విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి.
Also Read: నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా.. ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా: మహేష్ బాబు
Also Read: IND vs HK: హాంకాంగ్‌తో భారత్ మ్యాచ్.. కేఎల్ రాహుల్ ఔట్! టీమిండియా తుది జట్టు ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి