Saba Karim about Rishabh Pant place in India playing XI: ఆసియా కప్ 2022లో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్ పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అపురూప విజయాన్ని అందుకున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో నెగ్గితే సూపర్ 4 దశకు చేరడం దాదాపు ఖాయమే. అయితే పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కూర్పే చర్చనీయాంశంగా మారింది. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉండడంతో.. పాకిస్థాన్ మ్యాచ్‌లో కొంత మంది ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా బెంచ్‌కే పరిమితం అయ్యాడు.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను కాదని సీనియర్ కీపర్ దినేష్ కార్తీక్‌కు టీమ్ మేనేజేమెంట్ చోటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా భారత మాజీ మాజీ సెలక్టర్ సబా కరీం ఈ విషయంపై స్పందించారు. ఆసియా కప్ 2022లో పంత్‌కు తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చన్నారు.
సబా కరీం మాట్లాడుతూ... 'ప్రస్తుతం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రిషబ్ పంత్‌కు చోటు కష్టంగా కనిపిస్తోంది. ఆసియా కప్ 2022 వరకైనా భారత్ దినేశ్ కార్తిక్‌నే కీపర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. నాలుగో స్థానంలో రవీంద్ర జడేజాను పంపాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. జడేజా పాక్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. విలువైన పరుగులు చేశాడు. నాలుగో స్థానానికి తాను సరిపోతానని నిరూపించాడు. ఐదో స్థానంలోనూ జడ్డు రాణించగలడు' అని అన్నారు.
'లోయర్ ఆర్డర్ గురించి చెప్పనవసరం లేదు. ఈ పరిస్థితుల్లో మరో లెఫ్టాండర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలంటే.. దినేష్ కార్తీక్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే డీకే ఇటీవల బాగా ఆడుతున్నాడు. ఫినిషర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్‌గానూ బాగా చేస్తున్నాడు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో పంత్‌కు తుది జట్టులో చోటు కష్టమే అని నాకు అనిపిస్తోంది' అని సబా కరీం పేర్కొన్నారు.
Also Read: చిన్నప్పుడు గోడలు దూకావా?.. వరుణ్ తేజ్ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?
Also Read: నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా.. ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా: మహేష్ బాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి