Tatva on OTT:  ఈ మధ్య కాలం లో ఓటిటి సంస్థలు పోటాపోటీగా సినిమాలని తీసుకుంటూ జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో ఓటిటి లో వరుస సినిమాలు రిలీజ్ చేస్తుంది ఈటివి విన్. అయితే ఈటివి విన్ సినిమాలే కాదు.. గంట నిడివి ఉండి.. ఆసక్తిగా సాగే..షార్ట్ సినిమాలను కూడా దక్కించుకొని రిలీజ్ చెయ్యడం విశేషం. ఈ క్రమంలోనే ఈరోజు రిలీజ్ అయిన సినిమా "తత్వ". మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ:- ఆరిఫ్ అనే ఒక టాక్సీ డ్రైవర్ కి అత్యవసరంగా డబ్బు అవసరం పడుతుంది, సాయం చేసేవాడు ఎవ్వడు ఉండడు. అలాంటి టైం లో థామస్ అనే వ్యక్తీ ఆరిఫ్ టాక్సీ ఎక్కుతాడు. అర్జెంటుగా డబ్బు అవసరం ఉన్న ఆరిఫ్ కి ఆ రోజు రాత్రి థామస్ దగ్గర తనకి కావాల్సిన డబ్బు ఉందని తెలుస్తుంది. ఇక అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. అసలు థామస్ ఎవరు ? థామస్ దగ్గర ఉన్న డబ్బు ని దక్కించుకోవడానికి ఆరిఫ్ ఎంత వరకు వెళ్ళాడు? అసలు ఆరిఫ్ ఎందుకు క్రిమినల్ గా పోలీస్ ల ముందు విచారణలో కూర్చున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


నటీనటుల పర్ఫామెన్స్:- గంట నిడివి ఉన్న దీంట్లో పెద్దగా క్యారెక్టర్స్ ఎం ఉండవు. మెయిన్ గా మనకి సినిమా మొత్తం లో స్క్రీన్ మీద కనిపించేది ఆరిఫ్.. థామస్ క్యారెక్టర్స్ మాత్రమే..ఇద్దరూ కొత్తవాళ్ళే. కానీ ఎక్కడా కూడా ఇద్దరు కొత్తవాళ్ళు అనే అనిపించే రీతిలో లేరు, ఎందుకంటే వాళ్లకి ఇచ్చిన పరిమితిలో ఇద్దరు పోటాపోటీగా బానే చేసారు. ఆరిఫ్ కి థామస్ కి మధ్యలో వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అనే చెప్పొచు. ఒక రెండు మూడు సన్నివేశాలకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏ చాలా బాగా పనికొచ్చింది. ఆరిఫ్ అనే పాత్రలో హిమ దాసరి బాగా చేసాడు. ఇక థామస్ అనే పాత్రలో ఉస్మాన్ ఘని చాలా బాగా మెప్పించాడు. అలాగే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పూజ అనే కొత్త అమ్మాయి కూడా బాగా చేసింది. తను చేసిన పాత్ర తక్కువ నిడివితో ఉన్న కూడా కథకి చాలా అవసరం అయిన పాత్ర. సినిమాలో నటించిన ముగ్గురు కొత్తవాళ్ళే కాబట్టి ఎవరైన ఒక్కరు తెలిసిన ముఖం ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ప్రేక్షకులకి రావడం సహజం.



కథనం, టెక్నికల్ సిబ్బంది పనితీరు:- "తత్వ" అనేది మొత్తం ఒక్క రాత్రి లో జరిగే కథ. ఒక్క రాత్రిలో కథ చెప్పడానికి దర్శకుడు రుత్విక్ ఎంచుకున్న కథనం అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మొదటి ఇరవై ముప్పై నిముషాలు అయితే చాలా ఇంటరెస్టింగ్ గా తీసుకొని వెళ్తాడు. అలాగే కథ, కథనం లో భాగంగా సినిమాలో ఒక పాయింట్ వస్తుంది అది సినిమా ట్రైలర్ లో కూడా ఎక్కడా రివీల్ చేయలేదు, ఆ పాయింట్ ని మాత్రం చాలా చక్కగా తెరకెక్కించాడు. కానీ ఒక దశలో కథనం లో మొదటి అరగంట అయ్యాక కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా ఆ తరువాత దర్శకుడు చెప్పాలి అనుకున్న పాయింట్ ని ప్రేక్షకులు ఎవ్వరు ఊహించని విధంగా చాలా బాగా డైరెక్ట్ చేసి సక్సెస్ అయ్యాడు, అది తప్పకుండ అందరికి నచ్చే అంశం అవుతుంది. దాని గురించి ఇక్కడ చెప్పడం కంటే కూడా డైరెక్ట్ గా సినిమాలోనే చుస్తే బాగుంటుంది, అలాగే కథలో ఉండే ట్విస్ట్ గురించి కూడా డైరెక్ట్ గా చూసి తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా కార్ లో ఆరిఫ్ మరియు థామస్ మాట్లాడుకునే సన్నివేశాలు బాగుంటాయి. అలాగే వారిద్దరి మధ్య సంభాషణలు కూడా బాగుంటాయి.


ఇకపోతే టెక్నికల్ విషయానికి వస్తే సినిమా మొత్తం రాత్రే జరుగుతుంది కాబట్టి అర్ధరాత్రి రోడ్స్ ని అలాగే తీసుకున్న లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు దర్శకుడు. తన దర్శకత్వ పత్రిభతో ఆరిఫ్ మరియు థామస్ ల మధ్య కెమిస్ట్రీ ని బాగా పండించాడు, 
తన టేకింగ్ గాని, డైరెక్షన్ గాని చూస్తుంటే రుత్విక్ మొదటి సారి దర్శకత్వం చేస్తున్నాడు అన్నట్టు అస్సలు అనిపించదు. పైగా మంచి పనితనం తెలిసిన దర్శకుడిలాగానే అనిపిస్తాడు. ఎందుకంటే కథనం లో ఒక పాయింట్ అఫ్ టైం లో ప్రేక్షకులందరినీ కాసేపు వాళ్ళలో వాళ్ళు మానవత్వం గురించి ఆలోచించేలా చేస్తాడు. మాటలు కూడా అక్కడక్కడ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, ముఖ్యంగా సినిమా మొత్తం జరిగేది రాత్రే కాబట్టి కార్ లో, అలాగే కార్ బయట సీన్స్ గాని, అలాగే ఆరిఫ్ ని విచారించే గదిని గాని చాలా చక్కగా చూపించారు కెమరామెన్ సి.హెచ్.సాయి. సాయి తేజ అందించిన నేపధ్య సంగీతం కూడా చాలా బాగా సన్నివేశాల్ని ఎలివేట్ చేసాయి. ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ ములే కూడా ఆరిఫ్ ని విచారించే గదిని, అలాగే పబ్ సీన్స్ లో చాలా బాగా తన పని తనం చూపించాడు. సినిమాలో పని చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పని చేసారు అనేది కనిపిస్తుంది. టెక్నికల్ గా చూసుకుంటే "తత్వ" కి మంచి మార్క్స్ ఏ పడతాయి.


విశ్లేషణ:-  "తత్వ" తో తానూ చెప్పాలి అనుకున్న కథని, తానూ చెప్పాలి అనుకున్న తత్వ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దర్శకుడు మరియు రచయిత అయిన రుత్విక్ బానే చెప్పాడు, అక్కడక్కడ కొంచెం తడబడ్డా కూడా ఫైనల్ గా తానూ చెప్పాలి అనుకున్న పాయింట్ ని అర్ధం అయ్యేలా డైరెక్ట్ చేసి చెప్పగలిగాడు.


ప్లస్ పాయింట్స్:-


ఆరిఫ్ మరియు థామస్ పాత్రల మధ్యలో కెమిస్ట్రీ,
దర్శకుడి టేకింగ్,
ఆఖరిలో ట్విస్టు,
కెమెరా వర్క్,
నేపధ్య సంగీతం,
లొకేషన్స్ & ప్రొడక్షన్ వాల్యూస్



మైనస్ పాయింట్స్:-


అక్కడక్కడ కొంచెం ల్యాగ్,
క్లైమాక్స్ త్వరగా ముగించడం



తీర్పు:- "తత్వ" అనే టైటిల్ కి తగ్గ కథ, మానవత్వం గురించి చెప్పే కథ.


రేటింగ్: 2.75/5


Also read: Bank Holidays 2024: ఆ 5 రోజులు బ్యాంకులకు సెలవులు, ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు సెలవు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.