Chandrababu Fires on Jr NTR: ఎన్టీఆర్ కి, వైఎస్ఆర్ కి పోలికా ? సిగ్గు ఉండాలి..బాబు ఘాటు కామెంట్స్
TDP Chief Chandrababu Naidu Counter Jr NTR Twisting Tweet : ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారం మీద జూనియర్ ఎన్టీఆర్ స్పందన విషయంలో చంద్రబాబు ఘాటు కామెంట్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
TDP Chief Chandrababu Naidu Counter Jr NTR Twisting Tweet on NTR Health University Name Change: విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్న పేరును డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకుంది. ఈ విషయం మీద టీడీపీ ముందు నుంచి వీడియోని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ సహా ప్రతి నేత ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ఖండిస్తూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి పెద్ద అసెట్ గా భావిస్తూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగా కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పడం ఇప్పుడు టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. టిడిపిని ఎలాగో డిఫెండ్ చేయడం లేదు.
కనీసం తన సొంత తాత పేరు తీసేస్తే కూడా డిఫెండ్ చేయాలని పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలివిగా ట్వీట్ చేసిన 20 నిమిషాల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి నిమిషం 26 సెకండ్లు ఉన్న ఒక వీడియో బిట్ విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి, వైయస్సార్ కి పోలికా? సిగ్గుండాలంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్న విజువల్స్ ఉన్నాయి.
ఈ వీడియో ఎన్టీఆర్ ట్వీట్ కి కౌంటర్ గా ఇస్తూ చేసిందే అని పలువురు భావిస్తున్నారు. కొందరు ఎన్టీఆర్ కంటే వైయస్సార్ గొప్పవాడు అని అంటున్నారని అసలు ఎందులో వైయస్సార్ గొప్ప అంటూ చంద్రబాబు నాయుడు వీడియోలో ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కు రాజశేఖర్ రెడ్డి కి పోలిక ఇందులో పోలికా లేక, సమాజానికి ఇచ్చిన సేవలో పోలికా లేక జీవితంలో పోలికా అని తాను ప్రశ్నిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ కంటే రాజశేఖర్ రెడ్డి గొప్పోడు అంట చెప్పుకోవడానికి సిగ్గు అయినా ఉండాలి మీకు, అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో పోల్చుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.
ప్రపంచమంతా ఎంతో ఆరాధించే ఎన్టీఆర్ 100 సంవత్సరాలు జయంతి ఉత్సవాలను వచ్చే ఏడాది ఘనంగా జరుపుతున్నామని ప్రతి ఒక్క సిటీలో దాన్ని జరపబోతున్నారని, అలాంటి సమయంలో ఎన్టీఆర్ పేరు మార్చడమే గాక వైఎస్ఆర్ తో పోల్చడం కరెక్ట్ కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ ని ఎక్కడా టార్గెట్ చేసినట్లు కనిపించకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన 20 నిమిషాలకే తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ వీడియో షేర్ చేయడంతో ఇది ఎన్టీఆర్ కు ఇచ్చిన కౌంటర్ గానే పలువురు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.