Sarkaaru Vaari Paata Ticket Rates : టికెట్ ధరల పెంపుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
Sarkaaru Vaari Paata Ticket Rates : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం `సర్కారు వారి పాట`. ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టికెట్ రేట్లపై తాజా అప్‌డేట్ వచ్చింది.
Sarkaaru Vaari Paata Ticket Rates : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఈ మూవీకి సంబంధించిన టికెట్ రేట్లపై తాజా అప్‌డేట్ వచ్చింది. వారం రోజులపాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. రిలీజ్ డేట్ నుంచి మే 18వరకు ఈ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఏసీ సింగిల్ థియేటర్లయినా, మల్టీ ప్లెక్స్‌లయినా... రిక్లైనర్ సీటు ధర రూ.50వరకు పెంచుకునేందుకు అనుమతించింది.
ఏసీ కేటగిరీలో సీట్లకు వారంపాటు 30 రూపాయలు పెంచుకునేందుకు తెలంగణ సర్కారు వీలు కల్పించింది. నాన్ ఏసీ హాళ్లలో ఎలాంటి అదనపు రుసుం వసూలు చేసేందుకు అనుమతివ్వలేదు.
ప్రభుత్వం సర్కారు వారి పాట సినిమాకు ఐదు షోలకు అనుమతించింది. రిలీజ్ తేదీ నుంచి ఈ నెల 18 వరకు... ఉదయం ఏడు గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట మధ్య ఈ షోలు షెడ్యూల్ చేసుకునేందుకు అనుమతించింది. ఇప్పటికే ఏపీ సర్కారు కూడా అనుమతివ్వటంతో చిత్రయూనిట్ మంచి జోష్‌లో ఉంది.
Also Read - రేపు మనమున్నా లేకపోయినా చరిత్ర ఉంటుంది.. మన ప్రేమకథను వినిపిస్తుంది! వెన్నెల ఇంట్రడక్షన్ సూపర్
Also Read - VishwakSen on AVAK OTT : ఎ.వి.ఎ.కె. ఓటీటీ రిలీజ్ డేట్ తనకే తెలియదంటున్న విశ్వక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook