Telugu Film Federation served a Notice of Strike from 15th regarding wages: కొద్దిరోజుల క్రితం తెలుగు ఫిలిం ఫెడరేషన్ జీతాలు పెంచాలని అనూహ్యంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. తర్వాత నిర్మాతలు దిగివచ్చి కొంత వారి వేతనాలు పెంచిన పరిస్థితి కనిపించింది. అయితే వారు ఆశించిన మేర వేతనాలు పెరగకపోవడంతో మరోసారి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన 24 విభాగాల ఫెడరేషన్ సమ్మె నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనెల 15వ తేదీ నుంచి తాము సమ్మెకు దిగుతున్నట్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలో దిల్ రాజు సహా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కూడా ఫిలిం ఛాంబర్ లో ఈ విషయం మీద చర్చలు జరిపే అవకాశం కల్పిస్తోంది. నిజానికి తమకు సినీ నిర్మాణం వ్యయం భారీగా పెరిగిపోతుందని చెబుతూ తెలుగు సినీ నిర్మాతల మండలి దాదాపు నెలరోజులపాటు తెలుగు సినిమా షూటింగ్స్ ని నిలిపి వేయించిన సంగతి తెలిసిందే.


ఆ సమయంలో ఫెడరేషన్ తో చర్చలు జరిపి వేతనాలు పెంచే విషయం మీద ఒక నిర్ణయం తీసుకుంటామని వారు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఫిలిం ఫెడరేషన్ వేతనాలు పెంచమంటూ ఇలా సమ్మె నోటీసులు జారీ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది.


నిజానికి గతంలో ఉన్న వేతనాలను కొంతమేర పెంచారు కానీ అవి కూడా చాలడం లేదని ఫిలిం ఫెడరేషన్ ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్స్ ఇప్పుడే మొదలయ్యాయి అని క్లాస్త కుదుటపడుతున్న సినీ నిర్మాతలు అలాగే నటీనటులకు ఈ సమ్మె నోటీసులు కాస్త షాకింగ్ అనే చెప్పాలి. మరి ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఫిలిం ఛాంబర్ నిర్ణయానికి తెలుగు ఫిలిం ఫెడరేషన్ కట్టుబడి ఉంటుందా అనే విషయాలు త్వరలో తేలనున్నాయి. 


Also Read: Vijay Devarakonda on Janaganamana: 'జనగణమన' మర్చిపోండి..పరోక్షంగా చెప్పేసిన విజయ్ దేవరకొండ!


Also Read: SSMB 28 Title: మహేష్-త్రివిక్రమ్ మూవీకి ఆసక్తికర టైటిల్.. 'అ' సెంటిమెంట్ వదలడం లేదుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి