Thalapathy Vijay Instagram Followers సోషల్ మీడియాలో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్ అంటూ జరిగితే.. అది విజయ్ ఫ్యాన్స్‌ చేస్తారని కచ్చితంగా చెప్పొచ్చు. టాలీవుడ్ కోలీవుడ్ మధ్య వార్ జరిగిన ప్రతీ సారి విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతోంటారు. అలా విజయ్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి విజయ్ నేడు సాయంత్రం ఇన్ స్టాగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చిన గంటలోనే మిలియన్ ఫాలోవర్లు వచ్చి పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ ఫాలోయింగ్‌కు ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది. పోస్ట్ పెట్టిన గంటలోనే మిలియన్ల లైకులు, వేల కొద్ది కామెంట్లు వచ్చాయి. ఇన్ స్టాగ్రాంలో ఇలా ఆలస్యంగా అడుగు పెట్టినా కూడా అదరగొట్టేశాడు విజయ్. లియో సినిమా స్టిల్‌, ఆ సినిమాలోని లుక్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు విజయ్.


 



విజయ్‌ని వెంటనే కీర్తి సురేష్‌, కళ్యాణి ప్రియదర్శన్ వంటి హీరోయిన్లు ఫాలో కొట్టేశారు. ఇలా సెలెబ్రిటీలంతా కూడా విజయ్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. విజయ్ చివరగా వారసుడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి రిలీజ్ చేసిన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది. కానీ కోలీవుడ్‌లో మాత్రం మూడు వందల కోట్ల వరకు కొల్లగొట్టినట్టు సమాచారం.


విజయ్ సినిమాలు ఎలా ఉన్నా కూడా తమిళనాడులో ఆడేస్తాయ్ అని మరోసారి వారసుడు నిరూపించింది. యావరేజ్ సినిమాను సైతం ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్‌గా నిలబెడుతుంటారు. అలా విజయ్ సినిమాలన్నీ కూడా వంద, రెండొందల కోట్ల క్లబ్బులో జాయిన్ అవుతూనే వస్తోన్నాయి. వారిసు, బీస్ట్ సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం దుమ్ములేపేసింది.


విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్‌తో కలిసి లియో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్ రైట్స్ విషయంలో ఎన్నో రూమర్లు వస్తున్నాయి. వందల కోట్ల డీల్ జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


 Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్


Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook