Thalapathy Vijay: గత కొంతకాలంగా కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన విజయ్ సినిమాలకి దూరంగా వెళ్లబోతున్నారని ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో విజయ్ పేరు కూడా ముందే ఉంటుంది. దళపతి గా లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్ తమిళ్ లో మాత్రమే కాక తెలుగు లో కూడా మంచి హిట్ సినిమాలు తో కరియర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటిది ఈ సమయంలో విజయ్ సినిమాలకి గుడ్ బై చెప్పటం ఏంటి అని అభిమానులు కలత చెందడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం విజయ్ తమిళనాడులోని 234 నియోజకవర్గాల నుంచి విజయ్ మక్కల్ ఇయక్కం లీడర్లతో భేటీ కూడా అయ్యారు. పనయుర్, చెన్నైలోని పార్టీ ఆఫీసులో ఈ మీటింగ్ చోటుచేసుకుంది. ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత విజయ్ అతి త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని వార్తలు మొదలయ్యాయి.


విజయ్ ఇక సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లో పాల్గొనబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు కూడా కోడై కూశాయి. ఈ మధ్యనే లియో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమానే విజయ్ ఆఖరి సినిమా అని కూడా కొందరు కామెంట్లు చేశారు.


సినిమాలకి దూరమై రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక తనకంటూ ఒక ఛానల్ కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది. ఇప్పట్లో సినిమాలకి గుడ్ బై చెప్పి ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలు విజయ్ కి ఏ మాత్రం లేవని తెలుస్తోంది.


ఇక రాజకీయాల్లో విజయ్ ఆలోచనల గురించి పక్కన పెడితే సినిమాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని సమాచారం. ఇప్పటికి కూడా విజయ్ శంకర్, నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాల గురించి టాక్స్ లో ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఒక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన సినిమా ఈ మధ్య నే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉండబోతోంది.


Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   


Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook