Beast Trailer: ఉగాది రోజున బీస్ట్ ట్రైలర్.. సినిమా గురించి ఏడు ఆసక్తికర విషయాలు పంచుకున్న డైరెక్టర్!!
Beast Trailer release on April 2. కోలీవుడ్ స్టార్ హీరో `దళపతి` విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం `బీస్ట్`. ఈ సినిమా ట్రైలర్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల కానుంది.
Thalapathy Vijay's Beast Trailer release on April 2: కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. 'డాక్టర్' ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచనాలను నమోదు చేశాయి. దళపతి ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా బీస్ట్ చిత్ర బృందం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 'మేము కూడా మీ లాగే బీస్ట్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి విజయ్, పూజాహెగ్డేలతో పాటు పలువురు నటులు గోడచాటు నుంచి తొంగి చూస్తున్నట్లు ఉండే ఫోటోను జతచేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీస్ట్ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన 'అరబిక్ కుత్తూ', 'జాల్లీ ఓ జింఖానా' సాంగ్స్ హిట్ అయిన విషయం తెలిసిందే. అరబిక్ కుత్తూ పాట 24 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకోగా.. జాల్లీ ఓ జింఖానా సాంగ్ కూడా మూడున్నర కోట్లకు పైగా వ్యూస్ అందుకుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ఐదు భాషల్లో విడుదలకానుంది. విజయ్ చివరగా నటించిన మాస్టర్, బిగిల్ సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో.. బీస్ట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.
ఆసక్తికర అంశాలు:
# బీస్ట్ సినిమాలో దళపతి విజయ్.. వీర రాఘవ పాత్రలో రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు.
# కొలమావు కోకిల మరియు డాక్టర్ సినిమా లాగా బీస్ట్ ఉండదు. యాక్షన్, కామెడీ నేపథ్యంలో సినిమా ఉంటుంది.
# బీస్ట్ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి. మూడో పాట కథలో భాగంగా వస్తుంది.
# విజయ్‌తో తప్ప ఈ సినిమాను మరే ఇతర హీరోతో చేయలేను.
# సినిమాలో విలన్‌గా నటించడానికి 'కొత్త' ముఖం కోసం వెతుకుతున్న సమయంలో దర్శకుడు సెల్వరాఘవన్ కనిపించాడు.
# విజయ్ ఎత్తుకు తగ్గ హీరోయిన్ కోసం నెల్సన్ వెతుకుతున్న సమయంలో పూజా హెగ్డే కనిపించింది.
# తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్‌కి చెప్పడంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు.
Also Read: Ugadi 2022 Panchangam: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? లేదా?.. ఉగాది పంచాంగం ఏం చెబుతోందంటే?
Also Read: Rashmika Mandanna: ఊహించని షాక్.. రష్మికను సైడ్ చేసిన విజయ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook