Keedaa Cola:పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ చిత్రంతో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి కూడా మరచిపోలేని సూపర్ హిట్ అందించారు. అందుకే తరుణ్ భాస్కర్ పేరు వినగానే మనకి ముందుగా ఆ సినిమానే గుర్తొస్తుంది. ఇక ఆ తరువాత ఏమైంది ఈ నగరానికి అనే కామెడీ సినిమాతో యువతను బాగా ఆకట్టుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ రెండో సినిమా ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఆ తరువాత వచ్చిన మీకు మాత్రమే చెబుతా మాత్రం ఆయనకు నిరాశ మిగిల్చింది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కూడా నటించాడు. ఇక సీతారామం లాంటి బ్లాక్బస్టర్ లో ఒక పాత్రలో కనిపించాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఆయన మళ్లీ తన మొదటి రెండు సినిమాల లాగా ఒక సూపర్ హిట్ సాధించాలని మరో కొత్త కామెడీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.


తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో బ్రహ్మానందం, చైతన్య రావ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ కీడకోలా. ఈ సినిమా ఈరోజు నవంబర్ 3న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కాగా నిన్నటి నుంచే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన వాళ్ళు ఈ చిత్రం సూపర్ గా ఉంది అని రివ్యూ ఇస్తున్నారు. ఇక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. సినిమా విడుదలైన నెల లేదా రెండు నెలలకు కీడకోలా ఆహాలో ప్రత్యక్షం కానుంది.


తరుణ్ మీకు మాత్రమే చెబుతా సినిమా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాని తీశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో ఆడియెన్స్ ని అల్లరిస్తుందా లేదా తెలియాలి అంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి.


Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!


Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook