OTT and Theatre Releases: ఈ వారం ధియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
OTT and Theatre Releases: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరిగింది. అటు ధియేటర్ ఇటు ఓటీటీ రెండింట్లో విడుదలవుతున్నాయి. సినిమాలతో పాటు వివిధ రకాల వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవడం అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు.
OTT and Theatre Releases: వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వారం కూడా థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్నాయి. అన్ని రకాల భాషల్లో, అన్ని రకాల కంటెంట్ ఉండటం వల్ల ఓటీటీలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే కొత్త సినిమాలు ధియేటర్‌లో విడుదలైన నెలరోజులకే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈ వారం ధియేటర్‌లో విడుదల కానున్న కొత్త సినిమాలు
భిన్నమైన కథలతో మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్న మమ్ముట్టి ప్రధాన పాత్రలో కన్పించనున్న చిత్రం భ్రమయుగం ఈ నెల 15న మలయాళం, తెలుగులో విడుదల కానుంది. నైట్‌షిఫ్ట్ స్డూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ ఈ సినిమా నిర్మించారు. ఇక మరో సినిమా రాజధాని ఫైల్స్ కూడా ఇదే రోజు విడుదల కానుంది. ఇక చిన్న క్యారెక్టర్ నటుడి నుంచి హీరోగా రాణిస్తున్న సుహాస్ నటించిన మరో సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫిబ్రవరి 2న విడుదలైంది. సందీప్ కిషన్ నటించిన భైరవకోన ఫిబ్రవరి 16న విడుదల కానుంది. జయం రవి, కీర్తి సురేష్ నటించిన సైరన్ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీ సినిమాల జాబితా
నెట్‌ఫ్లిక్స్‌లో
ఫిబ్రవరి 13న సండర్ లెండ్ టిల్ ఐ డై వెబ్‌సిరీస్, ఫిబ్రవరి 14న లవ్ ఈజ్ బ్లైండ్ వెబ్‌సిరీస్, ప్లేయర్ల్ హాలీవుడ్ సినిమా, ఫిబ్రవరి 16న ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ స్ట్రీమింగ్ కానున్నాయి.
అమెజాన్‌లో
ఫిబ్రవరి 13న ఫైవ్ బ్లైండ్ డేట్స్ వెబ్‌సిరీస్, ఫిబ్రవరి 16న దిస్ ఈజ్ మి స్ట్రీమింగ్ కానున్నాయి.
జీ5లో..
ఫిబ్రవరి 14న ట్రాకర్ వెబ్‌సిరీస్, సబ నయగన్ తమిళ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో
ఫిబ్రవరి 12న ట్రాకర్ వెబ్‌సిరీస్, ఫిబ్రవరి 14న సబ నయగన్ తమిళ సినిమా, ఫిబ్రవరి 15న ఓజ్లర్ మలయాళం సినిమా, ఫిబ్రవరి 16న సలార్ హిందీ వెర్షన్, ఫిబ్రవరి 17న నా సామిరంగ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.
ఆహాలో
ఫిబ్రవరి 14న వీరమారి లవ్ స్టోరీ తమిళ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Also read: JEE Main 2024 Results: జేఈఈ మెయిన్స్ సెషన్ 1 2024 ఫలితాల విడుదల , ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook