Salman Khan: బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ చిత్రాల్లో హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఏక్‌ థా టైగర్‌’ ఒకటి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘టైగర్‌ జిందా హై’ కూడా మంచి హిట్‌ సాధించింది. ప్రస్తుతం ఈ సీరిస్‌లో మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘టైగర్‌ 3’ గా రానున్న ఈ చిత్రానికి సంబంధించిన సల్మాన్‌ ఫోటోలు...నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల చిత్ర పరిశ్రమలో లీకుల బెడద ఎక్కువగా ఉంది. అభిమానులకు సినిమా అప్‌డేట్స్‌ ద్వారా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని హీరోలు, చిత్ర యూనిట్‌ భావిస్తుండగా అవి ముందే నెట్టింట ప్రత్యక్షమై తారలకే షాక్కిస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌(Salman Khan), కత్రినా కైఫ్‌(Katrina Kaif) నటిస్తున్న ‘టైగర్‌ 3(Tiger3)’ చిత్రం రష్యా(Russia)లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా.. కారు ఛేజ్ సీక్వెన్స్ కోసం షూట్ చేస్తున్నప్పుడు సల్మాన్ పొడవాటి గోధుమ రంగు గడ్డంతో కనిపించాడు.


Also Read: IFFM-2021: ఉత్తమ నటుడిగా సూర్య, మనోజ్‌ బాజ్‌పాయ్‌.. ఉత్తమ నటిగా సమంత, విద్యాబాలన్‌


అయితే ఆయన అభిమానుల్లో ఒకరు షూటింగ్‌ జరుగుతుండగా కొన్ని ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం గడ్డంతో ఉన్న సల్మాన్‌ ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలో సల్మాన్ ఖాన్(Salman Khan) మార్చి చివరిలో ‘టైగర్ 3’ షూటింగ్‌ను ప్రారంభించగా, కరోనా మహమ్మారి కారణంగా చిత్రీకరణ ఆలస్యమౌతూ వచ్చింది. ఇందులో ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనున్నాడు. కలర్స్ టీవీ షో బిగ్ బాస్ 15(Bigg Boss15) షూటింగ్‌ కోసం సల్మాన్ అక్టోబర్ నాటికి భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook