IFFM: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత(Samantha)కు అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ఉత్తమ నటి(Best Actress)గా అవార్డు సొంతం చేసుకుంది.
సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐ.ఎఫ్.ఎఫ్.ఎం) 2021 అవార్డ్స్‌ను ప్రకటించింది. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్-2’(Family Man2)కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా సమంత, ఉత్తమ నటుడుగా మనోజ్ బాజ్‌పాయ్(Manoj Bajpayee) అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఓటీటీ(OTT)లో వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్'(Family Man) వెబ్ సిరీస్ లో రాజీ(Raji)గా డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఉత్తమ చిత్రంగా సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) నిలిచింది. ఇదే సినిమాకుగాను ఉత్తమ నటుడిగా సూర్య(Surya) ఎంపికయ్యాడు. అలాగే షేర్నీ సినిమాకు గాను విద్యా బాలన్(Vidya Balan)కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. . 27 భాషలకు చెందిన 120కిపైగా చిత్రాలు పోటీలో నిలిచాయి.
Also Read: 'RRR' movie update: అభిమానులకు మళ్లీ నిరాశే.. వాయిదా పడ్డ 'RRR' రిలీజ్ డేట్..??
'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో అద్భుతంగా నటించి, అభిమానుల్ని మెప్పించింది నటి సమంత(Samantha). నటిగా నూటికి నూరు శాతం న్యాయం చేసింది. ఇప్పుడు అందులో నటనకుగానూ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్(IFFMz0లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. ఎల్టీటీఈ ఉద్యమ నేపథ్య కథతో తీసిన 'ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్ పలు వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ.. నెటిజన్ల నుంచి విశేషాదరణ పొందింది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి(Priyamani) కంటే ఎక్కువగా సమంతకే నటనలో మార్కులు పడ్డాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook