Jr NTR Dubbing: ఆర్ఆర్ఆర్ కోసం తొలిసారిగా హిందీలో డబ్బింగ్ చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్
Jr NTR Dubbing: సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా ఆ పని చేశారు.
Jr NTR Dubbing: సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా ఆ పని చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్(RRR Movie). రౌద్రం..రణం..రుధిరంపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రధాన హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటిస్తుండగా ఇంకా అలియా భట్, అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల డ్యాన్స్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాలో మరో ప్రత్యేక విశేషముంది. దక్షిణాది భాషల్లో మలయాళం తప్ప మిగిలిన భాషల్లో హిందీ సహా సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ హిందీ డైలాగ్స్ వల్లిస్తున్నారు.కెరీర్‌లో పహెలీ బార్ అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హిందీలో డబ్బింగ్ చెబుతున్న పాట ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. 1920 నేపధ్యంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధులైన కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌లు కన్పించనున్నారు. జనవరి 7 వతేదీ 2022లో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ ఆంచనాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా హిందీ డబ్బింగ్(Jr Ntr First Dub in Hindi) చెప్పుకోవడం ఆసక్తిగా మారింది.
Also read: Pushpa Song Dispute: మగోళ్లకు కోపమొచ్చింది, ఆ పాటపై హైకోర్టును ఆశ్రయించిన పురుష సంఘం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook