Nithin and shalini wedding: కరోనావైరస్ (Coronavirus) కారణంగా వాయిదా పడిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ - షాలిని వివాహానికి ( Nithin Wedding ) డేట్ ఫిక్స్ అయింది.  వాస్తవానికి ఏప్రిల్ 16న నితిన్, షాలిని ప్రేమ వివాహం జరగాల్సి ఉండగా..  కరోనా లాక్‌డౌన్ (corona lockdown) కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో ఇరువురు కుటుంబసభ్యులు జూలై 26 రాత్రి 8.30 నిమిషాలకు ముహూర్తం ఖరారు చేసినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ.. వివాహ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఈ వివాహ వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితులు మత్రమే హాజరుకానున్నారు. అయితే నితిన్-షాలినిల పెళ్లి హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలస్‌లో జరగనున్నట్లు చర్చ జరుగుతోంది. Also read: హీరో నితిన్ పెళ్లి తేది, వేదిక ఖరారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నితిన్, షాలిని ఎంగేజ్‌మెంట్ కొంతమంది సన్నిహితుల మధ్య జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్ వేదికగా నితిన్, షాలినిల వెడ్డింగ్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. అయితే కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా నితిన్ పెళ్లిని, బర్త్ డే వేడుకలను వాయిదా వేసుకున్నాడు.  


భీష్మ సినిమాతో సూపర్హిట్‌ను సొంతం చేసుకున్న నితిన్ ప్ర‌స్తుతం రంగ్ దే, చెక్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో అంధాధున్ హిందీ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్పేట సినిమాలు చేయ‌నున్నారు. Also read: HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు


Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery