Sushant: టాలీవుడ్ నటుడు నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో..ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 కొత్తగా వెబ్‌సిరీస్ నిర్మిస్తోంది. సుశాంత్ ఇప్పటివరకూ కన్పించని గెటప్‌లో ఈ వెబ్‌సిరీస్‌లో కన్పించబోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో చాలాకాలం గ్యాప్ తరువాత స్క్రీన్‌పై కన్పించిన నాగార్జున మేనల్లుడు సుశాంత్..తెలుగు ప్రేక్షకులకు మరోసారి చేరువయ్యాడు. కెరీర్‌లో కరెంట్, అడ్డా, దొంగాట, ఆటాడుకుందాం రా వంటి చిత్రాలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురంలో కూడా మంచి క్లాస్ పాత్రలో నటించాడు. ఇప్పుడు తొలిసారిగా జీ5 నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌కు అంగీకరించాడు. కొల్లా ఎంటర్‌ప్రైజస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్ నటించేందుకు అంగీకరించిన సుశాంత్‌ను జీ5 టీమ్ ఘన స్వాగతం పలికింది. 


విశేషమేంటంటే సుశాంత్ ఇప్పటివరకూ చేయని పాత్రలో కన్పించబోతున్నాడు. తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. జీ5 నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో సుశాంత్..పోలీస్ జీప్ ముందు కూల్‌గా నిలుచుని కన్పిస్తున్నాడు. సుశాంత్ బర్త్‌డే సందర్భంగా వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్ నిన్న అంటే మార్చ్ 18వ తేదీన విడుదలైంది. 


Also read: Standup Rahul Review: స్టాండప్ రాహుల్ సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్ హిట్ అందుకున్నాడా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook