Standup Rahul Review: యువ కథానాయకుడు రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. శాంటో మోహన వీరంకి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (మార్చి 18)న థియేటర్లలో విడుదలైంది. కొత్త కథలను తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో రాజ్ తరుణ్.. స్టాండప్ కామెడీ నేపథ్యం కలిగిన ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ నటనతో ఆకట్టుకున్నారా? అనే విషయాలు తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
కథే ఏమిటంటే?
విశాఖపట్నం నేపథ్యంలో రాహుల్ (రాజ్ తరుణ్) అనే యువకుడు స్టాండప్ కామెడీ అంటే ఆసక్తితో ఉంటాడు. ఇంట్లో వాళ్ల ఒత్తిడితో ఉద్యోగాలు చేస్తూ.. వాటిలో నిలకడగా ఉండడు. అంతలోనే హైదరాబాద్ లో రాహుల్ కు ఓ జాబ్ ఆఫర్ వస్తుంది. కానీ, ఈసారి ఆ జాబ్ మానేయనని తన తల్లి ఇందు (ఇంద్రజ)కు మాట ఇస్తాడు. అయితే తన ఫ్యాషన్ స్టాండప్ కామెడీతో పాటు ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తాడు. ఈ క్రమంలో శ్రేయారావు (వర్ష బొల్లమ్మ) పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది.
అయితే శ్రేయారావుతో పెళ్లికి మాత్రం రాహుల్ ఒప్పుకోడు. ఎందుకంటే అతడి వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలే అందుకు కారణమని చెబుతాడు. అయితే చివరికి రాహుల్ తన మనసు మార్చుకున్నాడా? రాహుల్, శ్రేయారావు పెళ్లి చేసుకున్నారా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
స్టాండప్ కామెడీపై ఆసక్తి కలిగిన యువకుడిగా హీరో రాజ్ తరుణ్.. శ్రేయారావుగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటన చాలా బాగుంది. కథలో కొత్తదనం కారణంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. కథ పాతదే అయినా అందులోని కొత్తదనం ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. స్టాండప్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ ఫర్వాలేదనిపించింది. క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకుడు ఊహించిన విధంగా సాగుతుంది.
ఈ చిత్రంలో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శాంటో మోహన వీరంకి దర్శకత్వం వహించగా.. స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించారు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హైఫైవ్ పిక్చర్స్ పతాకంపై సిద్ధు ముద్దా నందకుమార్ అబ్బినేని, భరత మగులూరి నిర్మించారు.
Also Read: Bheemla Nayak OTT: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భీమ్లానాయక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
Also Read: RRR Movie Ticket Price: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆ సినిమా టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook