అర్జున్ రెడ్డి సినిమా ( Arjun reddy movie ) తో తిరుగులేని హీరోగా మారి...మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda )...వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓటుహక్కుపై విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


విలక్షణమైన మ్యానరిజం, ఆటిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్..తెలుగులో ఇప్పుడు తిరుగులేని హీరోగా ఉన్నాడు. కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా విజయ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 


ఇప్పుడీ విజయ్ దేవరకొండ వివాదాస్పదమయ్యాడు. ఓటుహక్కుపై విజయ్ చేసిన వ్యాఖ్యలపై ( vijay comments on vote ) తీవ్రమైన దుమారం రేగుతోంది. ప్రస్తుతం మన రాజకీయ వ్యవస్థ అర్ధం పర్ధం లేకుండా ఉందని విజయ్ చెప్పాడు. ఓటు వేసే హక్కు పేదవాళ్లకు, డబ్బున్నవాళ్లకు ఉండకూడదని...కేవలం మధ్యతరగతి వారికే ఉండాలని అర్జున్ రెడ్డి అన్నాడు. అదే విధంగా డబ్బు, మద్యం తీసుకుని ఓటు వేసేవారికి ఓటుహక్కు ఉండకూడదన్నాడు.


అంతటితో ఆగలేదు. తన వ్యాఖ్యల్నిసమర్ధించుకోడానికి ఓ లాజిక్ లెస్ అంశాన్ని ప్రస్తావించాడు. విమానం నడిపే పైలట్‌ను అందులో ప్ర‌యాణించ‌బోయే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా..! అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలని అన్నాడు. అంతే తప్ప అందరికి ఓటు హక్కు కల్పించకూడదని అన్నాడు.


అందుకే విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విజ‌య్ వ్యాఖ్య‌లపై దుమారం రేగుతోంది. విజయ్ వ్యాఖ్యలు నియంతృత్వ ధోర‌ణికి అద్దం ప‌ట్టేలా ఉన్నాయ‌ని కొంద‌రంటుంటే..మరికొందరు మాత్రం మద్దతిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవ‌ర‌కొండ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే అర్జున్ రెడ్డి సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. Also read: Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ