టాలీవుడ్ సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే. అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో నటించదనే వార్తకు బలం చేకూర్చే వాదనలు కూడా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి అందర్నీ ఫిదా చేసింది. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పటివరకూ కేవలం నటన ద్వారానే రాణిస్తోంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకత నిలబెట్టుకుంది. సహజ నటనతో వేలాదిగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. తాజాగా రానాతో నటించిన విరాటపర్వం, లేడీ ఓరియంటెడ్ సినిమా గార్గి అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తరువాత సాయి పల్లవి ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. అంతేకాదు..సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరించిందని సమాచారం. సినిమాలకు ఎందుకు దూరంగా ఉందని ఆందోళన చెందుతున్న ఆమె అభిమానులకు ఇప్పుడు షాక్ తగిలింది.


సాయిపల్లవి త్వరలో సినిమాల్ని వదిలేస్తుందనేది ఆ వార్త. గతంలో కూడా ఈ విధమైన వార్తలొచ్చినా..ఈసారి విన్పిస్తున్న కారణం బలంగా ఉంది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సాయి పల్లవి..నటనపై ఆసక్తితో సినిమాల్లో వచ్చింది. ఇప్పుడు తిరిగి వైద్యవృత్తి కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టుగా సమచారం. ఇప్పటికే కోయంబత్తూర్‌లో హాస్పిటల్ నిర్మిస్తోందట. నిర్మాణం పూర్తయ్యాక..చెల్లెలు పూజతో కలిసి ఆసుపత్రి చూసుకోనుందని తెలుస్తోంది. ఈసారైతే సాయి పల్లవి సినిమాలకు స్వస్తి చెప్పనుందనే వార్త గట్టిగానే ప్రచారమౌతోంది. స్పష్టత రావాలంటే..ఆమెనే సమాధానం చెప్పాలి.


Also read: AP Politics: గంటా శ్రీనివాసరావు టీడీపీకు గుడ్ బై, త్వరలో వైసీపీలో చేరిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook