Happy Birthday Sridevi: బాలీవుడ్ అందాల తార, దివంగత శ్రీదేవి జయంతి ఈరోజు ఆగస్టు 13న. ఈ సందర్బంగా ఆ మహానటి నటించిన ఐదు సినిమాలు తప్పుకుండా చూడాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ అందాల నటి శ్రీదేవి మరణించి అప్పుడే నాలుగేళ్లు దాటేసింది. 2018లో మరణించిన ఆమె జయంతి ఇవాళ. ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి ప్రస్థానం తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్‌కు సాగింది. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె నటించిన కొన్ని క్లాసికల్ హిట్స్ గురించి తెలుసుకుందాం..


మిస్టర్ ఇండియా


90, 80 దశకంలో జనరేషన్‌‌‌కు బాగా గుర్తుండిపోయే సినిమా ఇది. మిస్టర్ ఇండియా అంటేనే ఓ పూనకం వచ్చినట్టుగా అనుభూతి. అంతగా సూపర్ హిట్టైన ఈ సినిమా 1987లో విడుదలైన మిస్టర్ ఇండియా అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా..శ్రీదేవి కెరీర్‌లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాను బోనీ కపూర్, సురిందర్ కపూర్ సంయుక్తంగా నరశింహ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో శ్రీదేవి ఒక న్యూస్ రిపోర్టర్ పాత్ర పోషిస్తుంది. 


ఇంగ్లిష్ వింగ్లిష్


15 ఏళ్ల విరామం తరువాత శ్రీదేవి తిరిగి నటించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ విశ్లేషకులు, విమర్శకుల ప్రశంసలు పొందింది. యూఎస్‌లో ఇంగ్లీషు నేర్చుకుంటున్న ఓ భారతీయురాలిగా, గృహిణిగా శ్రీదేవి అద్భుతపాత్ర పోషించింది. ఇంగ్లీషు రాక భర్త, పిల్లలతో తరచూ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్న గృహిణిగా పాత్రలో లీనమైంది. 


మామ్


2018లో శ్రీదేవి మరణించే ముందు నటించిన ఆఖరి సినిమా ఇది. ఈ సినిమా ఆమె సినీ ప్రస్థానంలో 300వ సినిమా. 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మామ్ సినిమాకు రెండు అవార్జులు లభించాయి. ఇందులో కుమార్తెపై అత్యాచారం జరిపినవారిపై ప్రతీకారం తీర్చుకున్న శక్తివంతమైన తల్లిగా జీవించింది. 


జుదాయి


అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్న మరో క్లాసికల్ సినిమా జుదాయి. అద్భుతమైన యూనిక్ స్టోరీతో విడుదలైన జుదాయి సినిమాలో శ్రీదేవి..డబ్బు కోసం భర్తను మరో మహిళకు అమ్మేసిన భార్యగా పాత్ర పోషించింది. ఆ తరువాత తాను ఎంత పొరపాటు చేసిందో గ్రహిస్తుంది. శ్రీదేవి అద్భుత నటనల్లో ఈ సినిమా ఒకటి.


చాందిని


1989లో బాక్సాఫీసును కుదిపేసిన సినిమా చాందిని. శ్రీదేవి కెరీర్‌‌లో ఎవర్ బిగ్గెస్ట్ హిట్ ఇది. అదే ఏడాది నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగరీలో అవార్డు సాధించిన సినిమా ఇది. 1980 దశకంలో శ్రీదేవిని బాలీవుడ్‌లో సూపర్ స్టార్ నటిగా చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో శ్రీదేవితో పాటు రిషి కపూర్, వినోద్ ఖన్నాలు నటించారు.


Also read: Karthikeya 2 Review: సూపర్ హిట్ కార్తికేయ సీక్వెల్ సినిమా ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook