Surya movies: తమిళ, తెలుగు భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. సూర్య సినిమాలకు తెలుగులో పుల్ డిమాండ్. అయితే అంతటి హీరో కూడా ఆ సినిమాలు చూడాలంటే భయపడతాడట. ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకుని చూస్తాడట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టాలీవుడ్ ( Tollywood ), కోలీవుడ్ ( Kollywood )ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించుకున్న నటుడు సూర్య ( Surya ). తెలుగు పరిశ్రమలో ఆయన మార్కెట్ ఎంతో చూస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా 20 కోట్ల మార్కెట్ ఉంది సూర్యకు టాలీవుడ్‌లో. ఇటీవలే ఆకాశం నీ హద్దురా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ( OTT Platform )‌పై విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి స్వయంగా సూర్య ఫిదా అయిపోయాడట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్న సూర్యకు ఆకాశం నీ హద్దురా ( Akasam nee haddura ) ఒక మంచి బ్రేకప్‌గా ఉంది. అంతవరకూ బాగానే ఉంది కదా. మరి భయమేంటనుకుంటున్నారా..


తను నటించిన సినిమాలు చూడాలంటే సూర్య చాలా భయపడుతుంటాడట. మరోవైపు సిగ్గు పడుతాడట కూడా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించాడు. సినిమా విడుదలైన వంద రోజుల తరువాత గానీ ఒక్కోసారి సినిమా చూడనని అంటున్నాడు. అందరూ బాగుందని చెబితేనే వెళ్తానని చెబుతున్నాడు. ప్రేక్షకుల్నించి వచ్చే స్పందన చూసి ఆనందపడుతానంటున్నాడు. అయితే తన భార్యో జ్యోతిక గానీ..తమ్ముడు కార్తి గానీ వచ్చిన సినిమా వెంటనే చూస్తారని అంటున్నాడు. జ్యోతిక ( Jyothika ), కార్తి ( Karthi )లు ఇష్టపడి పనిచేస్తారని..తాను మాత్రం తన పనీతీరుపై లేదా నటనపై అంత త్వరగా సంతృప్తి చెందనంటున్నాడు. తన సినిమాల్ని తానే విమర్శించుకుంటాడు సూర్య.. ప్రతిసారీ ఇంకా బాగా పనిచేయాలనేదే తన ఆలోచన అంటున్నాడు. అంత త్వరగా తనకు తాను నచ్చను కాబట్టే..తన సినిమాలు చూడ్డానికి భయపడతానంటున్నాడు.


Also read: Uppena Pre Release Event: ఉప్పెన మూవీ గురించి Chiranjeevi స్పీచ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook