ఏ మాత్రం చడీచప్పుడు లేకుండా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా లక్షలాది రూపాయలు వసూలు చేసిన సినిమా కాంతారా. ఈ సినిమాపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంతారా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంతార సినిమా..సినిమా నిర్మాతల్ని ఒత్తిడికి గురి చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమా ఎలా తీస్తున్నారనేది సమీక్షించుకోవాలన్నారు. భారీ కలెక్షన్ల కోసం పెద్ద ప్రాజెక్టులే చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనికి ఉదాహరణే 16 కోట్లతో తీసిన సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.


ప్రేక్షకుల్లో ఆతృత ఉన్నా..మనమేం చేస్తున్నామనేది పరిశీలించుకోవాలని రాజమౌళి తెలిపారు. సెప్టెంబర్ నెలలో విడుదలైన కాంతారా సినిమా..మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్‌ను పక్కనపడేసింది. ఈ సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రాచుర్యం పొందింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసిన రాజమౌళి..కాంతారా సినిమా విజయం సాధించడంతో ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది. కాంతారా సక్సెస్ రాజమౌళి మైండ్‌సెట్ మార్చేసిందా అనే సందేహాలు వస్తున్నాయి.


Also read: Unstoppable Movie: అన్‌స్టాపబుల్ సినిమా పోస్టర్ విడుదల చేసిన దిల్‌రాజు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook