Tollywood heroine Samantha reacts on Minister KTR post: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన వెంటనే వైరల్ అయిపోతోంది. అంతేకాదు చైతో (Nagachaitanya) విడాకులు తీసుకున్న తర్వాత సామ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగారు. సినిమాల్లో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు సమంత (Samantha) ఏం చేసినా కూడా న్యూసే అవుతోంది. సమంత మునుపటి కంటే ఎక్కువ ఇప్పుడే చాలా బిజీ అయిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు.. సామ్ సోషల్ మీడియాలో (Social media) ఇప్పుడు మరింత యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) స్టోరీలలో కేటీఆర్ (KTR) పెట్టిన ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. 


చిన్నపిల్లలకు మరింత రక్షణ చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆప‌ద‌లో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల బాల ర‌క్షక్ వాహ‌నాల‌ను ప్రారంభించారు. జిల్లాకొక‌టి చొప్పున 33 బాల ర‌క్షక్ వాహ‌నాల‌ను (Bal Rakshak vehicles) ఏర్పాటు చేశారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా సదుపాయం కల్పించారు. మంత్రి సత్యవతి (Minister Satyavathi) చేసిన ఈ పనిని మెచ్చుకుంటూ కేటీఆర్ (KTR) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


Also Read : మోహన్ బాబు ఇంట విషాదం.. రంగస్వామి నాయుడు మృతి


మంత్రి కేటీఆర్ పెట్టిన పోస్ట్‌ను.. సమంత (Samantha) తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. 33 బాల రక్షక వాహనాలు (Bal Rakshak vehicles) ప్రారంభమయ్యాయి అంటూ చప్పట్లు కొడుతూ ఎమోజీ పెట్టింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


Also Read : IND Vs NZ 1st T20* : న్యూజిలాండ్  Vs ఇండియా  ఫస్ట్ టీ 20 LIVE SCORE UPDATES*


ఇక సమంత (Samantha) గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లీట్ చేసుకుంది. తమిళంలో విజయ్‌ సేతుపతితో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. మరోవైపు పుష్ప మూవీలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట సామ్ (Samantha).


Also Read : వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురిపై తండ్రి అత్యాచారం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook