Tollywood: తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుని టాప్ హీరోయిన్స్‌గా ఎదుగుతుంటారు కొంతమంది. ఆ కోవలో ఉప్పెన హీరోయిన్ తరువాత మరో హీరోయిన్ వచ్చి చేరింది. జాతిరత్నాలులో మెరిసిన ఫరియాకు బంపర్ ఆఫర్ దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌లో (Tollywood) ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న పేరు కృతిశెట్టి. ఉప్పెన సృష్టించిన సంచలనం ఓ కారణమైతే..అందులో కృతిశెట్టి (Kritishetty) అభినయానికి, నటనకు చాలా మార్కులు పడ్డాయి. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఉప్పెన (Uppena movie) తో వచ్చిన క్రేజ్‌తో  కృతిశెట్టి భారీ ఆఫర్లే అందుకుంటోంది. ఇప్పుడీమె సరసన మరో కొత్త నటి వచ్చి చేరింది. జాతిరత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తొలి సినిమాతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. మార్చ్ 11 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన సినిమా హిట్‌టాక్ మూటగట్టుకుంది. ఉప్పెనలో హిట్ అయినట్టే ఇందులో కూడా చిట్టి నా బుల్ బుల్ చిట్టి పాట చాలా పాపులర్ అయింది. 


వాస్తవానికి మూవీ విడుదలకు ముందే ఫరియా అబ్దుల్లా (Fariya Abdullah) ప్రముఖ నటుడు రెబెల్ స్టార్ ప్రభాస్‌ను సైతం ఆశ్చర్యపర్చింది. జాతిరత్నాలు (Jathiratnalu )ట్రైలర్ విడుదల సందర్బంగా..ఈవిడేంటి..నా కంటే పొడుగుంది అంటూ ప్రభాస్ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రానున్న మూవీలో రవితేజ సరసన ఫరియా అబ్దుల్లాను తీసుకోనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఖిలాడీ సినిమా తరువాత ఫరియా అబ్దుల్లా (Fariya Abdullah) హీరోయిన్‌గా రవితేజ సినిమా తెరకెక్కనుంది. 


Also read: Jathi Ratnalu, Sreekaram, Gali Sampath: జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్.. వీటిలో ఏది బ్లాక్‌బస్టర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook