Tollywood latest updates hyderabad city civil court issued notices to Dasari Narayana Rao sons Arun Kumar And Prabhu: దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన కుమారులు దాసరి అరుణ్‌, దాసరి ప్రభులకు ఆర్డర్‌ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్‌ కోర్టు నోటీసులు ఇచ్చింది. వ్యాపార లావాదేవిల్లో భాగంగా ఓ ప్లాంట్‌ నిర్మాణం కోసం సోమ శేఖర్‌రావు అనే వ్యాపారి వద్ద ప్రభు, అరుణ్‌లు 2 కోట్ల 11 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారట. అయితే ఆ డబ్బులు తిరిగి చెల్లించడంలో వారిద్దరూ జాప్యం చేస్తున్నారంటూ సోమశేఖర్‌ రావు సివిల్‌ కోర్టును ఆశ్రయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాసరి నారాయణరావు ( Dasari Narayana Rao) కుమారులు దాసరి ప్రభు (Dasari Prabhu), అరుణ్‌ (Dasari Arun) తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బును చెల్లించడంలేదని వారు తనకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు (Atluri Somasekhar Rao) అనే బాధితుడు కోర్టును కోరాడు. దీంతో కోర్టు దాసరి ఇంటికి నోటీసులు పంపింది. డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది.


Also Read : Deepavali 2021 Safe Tips: 'దీపావళి' రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జాగ్రత్తలు మరవద్దు


తీసుకున్న డబ్బులను సోమశేఖర్‌రావుకు తిరిగి చెల్లించడానికి నవంబర్ 15 వరకు కోర్టు గడువు విధించింది. కాగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకు తనను చంపుతామని దాసరి (Dasari) కుమారులు బెదిరిస్తున్నారని గతంలోనే పిటిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read : Huzurabad by Poll: ఇది అహాంకారానికి-ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం..ఈటెల సంచల వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి