Dasari Narayana Raoకి ప్రభుత్వ గుర్తింపు రాకపోవటం తీరని లోటు: చిరంజీవి

Dasari Narayana Rao Birth Anniversary | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి జయంతి సందర్భంగా ఆయన సేవలకు పద్మ పురస్కారం కోరుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. #PadmaForDrDasari అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 

Written by - Shankar Dukanam | Last Updated : May 4, 2021, 04:33 PM IST
Dasari Narayana Raoకి ప్రభుత్వ గుర్తింపు రాకపోవటం తీరని లోటు: చిరంజీవి

పలు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన టాలీవుడ్ దర్శకుడు దాసరి నారాయణ రావు జయంతి నేడు(మే 4). దర్శకరత్న దాసరి, సంచలన దర్శకుడు క్రాంతి కుమార్ జయంతిని సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు వారికి నివాళులు అర్పిస్తున్నారు. అద్భుత విజయాలు అందుకున్న సినిమాలు తెరకెక్కించి, నిర్మించిన దాసరి, క్రాంతి కుమార్ సేవల్ని స్మరించుకున్నారు.
 
ద‌ర్శక‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావుకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతగానో సేవ చేసిన దాసరికి ప‌ద్మ పుర‌స్కారం ఇవ్వాల‌ని చిరంజీవి(Chiranjeevi) తన ట్వీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు జన్మదినం సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజ‌లి. విజయాలలో ఒకదానికి మించిన మరో చిత్రాలను తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు, నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమే.

దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావుకు ఇప్పటికీ ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటు. ఆయనకు మరణానంతరం అయినా సరే ఆయన సేవలకు గుర్తింపుగా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవం అవుతుందని’ మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు దాసరి(Dasari Narayana Rao) జయంతి సందర్భంగా ఆయన సేవలకు పద్మ పురస్కారం కోరుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. #PadmaForDrDasari అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 

Also Read: Pawan Kalyan లేటెస్ట్ సూపర్ హిట్ Vakeel Saab మూవీ OTTలో విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News