Double ismart OTT Release: టాలీవుడ్ హిట్ నటుడు రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా చాలా సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు వసూలు చేయలేక చతికిలపడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదృష్టం పరీక్షించుకోనుంది. ఏ చడీ చప్పుడు లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ నటుడు రామ్ పోతినేనికి చాలా కాలంగా మంచి హిట్ లభించలేదు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంథ ఆశించిన హిట్ ఇవ్వలేదు సరికదా బాక్సాఫీసులో బోల్తా పడింది. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ అన్నింటిలో అంచనాలు పెరిగినా సినిమా థియేటర్లో మాత్రం ఫెయిల్ అయింది. ఇక లైగర్ పాన్ ఇండియా సినిమాతో ఘోరంగా విఫలమైన దర్శకుడు పూరీ జగన్నాధ్. ఇతడికి కూడా చాలా కాలంగా మంచి హిట్ లేదు. దాంతో పూరీ జగన్నాధ్ రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించాడు. దర్శకుడిగా పూరీ జగన్నాధ్ , నటుడిగా రామ్ పోతినేనికి ఈ సినిమా హిట్ చాలా అవసరం.


ఆగస్టు 15న భారీ అంచనాలతో ధియేటర్లలో విడుదలైన డబుల్ ఇస్మార్ట్ డబుల్ కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. మరోసారి ఇద్దరికీ ఘోర వైఫల్యం ఎదురైంది. బాలీవుడ్ నుంచి సంజయ్ దత్‌ను విలన్‌గా తీసుకొచ్చి ప్రయోగం చేసినా సక్సెస్ కాలేకపోయారు. కథలో దమ్ము లేనప్పుడు ఎవరు నటిస్తే ఏంటనేది గ్రహించలేకపోయారు. కధలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. దాంతో థియేటర్ల నుంచి తొలగిపోయింది. ఇక ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఓటీటీలో ఎలాంటి ప్రకటనల్లేకుండా సైలెంట్‌గా విడుదలయింది. ఇవాళ అంటే సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ధియేటర్‌లో డబుల్ ఇస్మార్ట్ మిస్సయితే ఇంట్లో కూర్చుని ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు


Also read: Praising Politics: నిన్న బాబుపై షర్మిల, నేడు రేవంత్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు, ఏం జరుగుతోంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.