Praising Politics: నిన్న బాబుపై షర్మిల, నేడు రేవంత్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు, ఏం జరుగుతోంది

Praising Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రెండు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం బంధం స్పష్టంగా కన్పిస్తోంది. చంద్రబాబు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధమో మరే ఇతర కారణమో గానీ ఒకరిపై మరొకరు ప్రశంసించుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2024, 07:54 AM IST
Praising Politics: నిన్న బాబుపై షర్మిల, నేడు రేవంత్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు, ఏం జరుగుతోంది

Praising Politics: ఏపీ, తెలంగాణలో పరస్పర వ్యతిరేక ప్రభుత్వాలు కొలువు దీరినా ఒకరికొకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఏపీలో బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం నడుస్తున్నా కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం-జనసేన బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులో జరగనున్న రాజకీయ పరిణామాలకు వేదిక కావచ్చని తెలుస్తోంది. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరస్పర వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పాటయి ఉన్నా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురుశిష్యులే. బహుశా అందుకే తెలంగాణలో బీజేపీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సవాలు విసురుతున్నా..ఏపీలో మాత్రం బీజేపీతో కలిసిన ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబును ప్రశంసిస్తుంటే..ఇక్కడి కూటమి ప్రభుత్వ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

విజయవాడ వరదల నేపధ్యంలో వరద సహాయక చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశంసలు కురింపించారు. చంద్రబాబు సమర్ధవంతంగా వరద సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. రాజకీయంగా ఇది పార్టీకి ఇబ్బంది కల్గించే పరిణామం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చడం లేదు. వరదలపై ప్రభుత్వంపై  విమర్శలు వస్తున్న నేపధ్యంలో షర్మిల ప్రశంసలు కురిపించడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

ఇప్పుడు తాజాగా ఏపీలోని కూటమి ప్రభుత్వ అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రబాబును ప్రశంసిస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్..తెలంగాణలో ఆక్రమణలు కూలుస్తున్న హైడ్రా గురించి ప్రస్తావించారు. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను పరిరక్షించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తీసుకురావడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. చెరువుల్ని కాపాడే విషయంలో రేవంత్ రెడ్డి మంచి పని చేశారన్నారు. అక్రమ నిర్మాణాలు లేకపోతే ఇలాంటి విపత్తులు రావన్నారు. 

అక్రమార్కులపై హైడ్రా వంటివి కచ్చితంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆక్రమణల గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్‌కు కృష్ణా నది కరకట్టపై ఉన్న సొంత ముఖ్యమంత్రి నివాసం గురించి తెలియలేదా అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ, తెలంగాణలో ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Also read: Floods Fear: విజయవాడలో మళ్లీ వరద భయం, ఇళ్లు వదిలి లాడ్జీల్లో నివాసముంటున్న ప్రజలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News