Kousalya Covid 19: కరోనా బారిన పడిన కౌసల్య.. తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న సింగర్!!
టాలీవుడ్ సీనియర్ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె బెడ్‌పై నుంచి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నారట.
Singer Kousalya Potturi tested positive for Covid 19: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. మూడో దశలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్ ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ స్టార్లు, పలువురు సెలబ్రిటీలను కరోనా వెంటాడుతూనే ఉంటోంది. మూడో దశలో ఇప్పటికే ఎంతో మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ సింగర్ కౌసల్య (Kousalya Potturi)కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
'నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచే నాకు తీవ్ర జ్వరంగా ఉంది. కనీసం బెడ్‌పై నుంచి కూడా లేవలేకపోతున్నాను. ప్రస్తుతం గొంతు నొప్పి నన్ను ఎంతో బాధిస్తోంది. నిన్నటి నుంచే మందులు వాడటం మొదలుపెట్టాను. త్వరలోనే ఈ వైరస్‌ను ఓడించి మీ ముందుకు వస్తాను. అందుకోసం వేచిచుస్తున్నా. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి' అని సింగర్ కౌసల్య (Singer Kousalya) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
Aslo Read: Rashmika Mandanna - Karan Johar: రష్మిక అందానికి స్టార్ ప్రొడ్యూసర్ ఫిదా.. భారీ ఆఫర్ ఇచ్చాడుగా!!
ఈ విషయం తెలిసిన కౌసల్య అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మూడో దశలో సినిమా పరిశ్రమను కరోనా వెంటాడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎవరిని కనికరించడం లేదు. టాలీవుడ్‌లో తాజాగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, యానీ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. అంతకుముందు మంచు లక్ష్మి, మహేష్ బాబు, థమన్ తదితరులు ఈ వైరస్ బారిన పడి కోలుకున్నారు.
కౌసల్య గుంటూరులోని మహిళా కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంతో పాటు కర్ణాటక సంగీతంలో డిగ్రీ పొందారు. ఆ తరువాత పద్మావతి విశ్వవిద్యాలయంలోశాస్త్రీయ సంగీతంలో పీజీ చేశారు. తెలుగులో కౌసల్య ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. రా.. రమ్మని రారా రమ్మని, లంచ్‌కొస్తావా.. మంచుకొస్తావా, వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా, మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా, నివ్వక్కడుంటే నేనిక్కడుంటా లాంటి 300 పాటలు పాడారు. ముఖ్యంగా దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, కౌసల్య కాంబినేషన్‌లో చాలా సాంగ్స్ హిట్ అయ్యాయి.
Also Read: IND vs WI: ప్రాక్టీస్ లేకుండా బరిలో దిగడం కష్టం.. టీమిండియాలో అతడి రీఎంట్రీ అంత ఈజీ కాదు: భజ్జీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook