Tollywood Stars OTT Entry : ఇప్పుడు నెమ్మదిగా ట్రెండ్ మారుతోంది. ఇదివరకటిలా అందరూ సినిమాలు అనగానే థియేటర్లకు వెళ్లి చూడటానికి ఆసక్తి చూపడం లేదు. కరోనా కంటే ముందే మన దేశంలో ఓటీటీలు ఎంట్రీ ఇచ్చినా కరోనా పుణ్యమా అని యూజర్ బేస్ విపరీతంగా పెంచుకున్నాయి. ఇప్పుడు థియేటర్లతో పాటు ఓటీటీ మార్కెట్ ను కూడా దర్శక నిర్మాతలు దృష్టిలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ స్టార్ హీరోలు సైతం ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే మన తెలుగు నుంచి పలువురు నటీనటులు వెబ్ సిరీస్లు, వెబ్ ఒరిజినల్ మూవీస్, ఒటీటీ రియాలిటీ షోలలో కనిపించారు. అవకాశాలు లేని వారే ఒటీటీ వంక చూస్తున్నారని అనలేం. ఎందుకంటే మంచి అవకాశాలు ఉన్న హీరోలు సైతం ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎవరెవరు అలా సందడి చేయబోతున్నారు అనే అంశం మీద ఒక లుక్కు వేద్దాం. వెంకటేశ్‌, తన కుమారుడు రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే సిరీస్‌ తో నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సిరీస్ కు కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. 


అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ షూట్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సిరీస్ లో సుర్వీన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక మరోపక్క వరుస సినిమాలతో ఊపు మీదున్న నాగచైతన్య ‘ధూత’ అనే సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. హారర్‌ నేపథ్యంలో అమెజాన్ ఒరిజినల్ సిరీస్ గా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరో అక్కినేని కుటుంబ హీరో సుశాంత్‌ ‘మా నీళ్ల ట్యాంక్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ‘జీ 5’లో విడుదల కానుంది. 


డైరెక్టర్ అవ్వాలని వచ్చి ‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో హీరోగా మారిన రాజ్‌ తరుణ్‌ త్వరలోనే ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సిరీస్ ను ‘ఏబీసీడీ’ సినిమా ఫేం సంజీవ్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ‘జీ 5’లో విడుదలకానుంది. హీరో ఆది సాయికుమార్‌- లావణ్య త్రిపాఠి జంటగా ‘పులి- మేక’ అనే వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కనుంది. పంతం దర్శకుడు చక్రవర్తి ఈ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నారు. వీరు కాకుండా మరికొంత మంది సైతం ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. 
Also Read:Vikram OTT Date: విక్రమ్ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..


Also Read: Rashmi Found Dead :సీక్రెట్ గా సహజీవనం.. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook