Devara: జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విషయంలో.. ఇండస్ట్రీ ఇంత మౌనం ఎందుకు?
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదలవుతున్న సమయంలో మిగతా స్టార్ హీరోలు.. ఆ హీరో కి సపోర్ట్ చేస్తూ కనీసం ట్వీట్స్ అయినా చేస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ విషయంలో అది కూడా జరగకపోవడం.. చాలామందికి షాక్ ఇచ్చింది.
Jr NTR Vs Tollywood: 2018 లో అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ నటించిన సోలో హీరో సినిమా Devara. మధ్యలో RRR సినిమా వచ్చినా కూడా అది ఎన్టీఆర్ సోలో సినిమా కాదు.. రామ్ చరణ్ కూడా నటించిన మల్టీ స్టారర్ సినిమా. కాబట్టి దేవరా సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా.. చాలా వరకు అంచనాలను అందుకొని మంచి విజయాన్ని సాధించింది.
అయితే ఈ సినిమా విషయంలో చిత్ర బృందం భారీగానే ప్రమోషన్లు చేసింది.. కానీ ఇండస్ట్రీ మాత్రం ఈ సినిమా గురించి మౌనంగా ఉండటం ఫాన్స్ ని సైతం షాక్ కి గురిచేస్తోంది. ఒక హీరో కూడా ఎన్టీఆర్ సినిమాకి సపోర్ట్ చేస్తూ కనీసం ట్వీట్ కూడా చేయలేదు. చిన్న సినిమాలకు మద్దతు పలుకుతూ సినిమా చాలా బాగుంది అంటూ ట్వీట్లు చేసే మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఎన్టీఆర్ దేవర సినిమా గురించి ఏం మాట్లాడలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కోస్టార్ రామ్ చరణ్ కూడా సినిమా విడుదలకి ముందు శుభాకాంక్షలు చెప్పారు కానీ.. సినిమా విడుదల సక్సెస్ అయ్యాక ఒక్కటి పెట్టుకోడా చేయలేదు. అప్పుడప్పుడు సినిమాలు బాగున్నాయి అంటూ కామెంట్స్ చేసే చిరంజీవి కూడా దేవర గురించి మాట్లాడలేదు.
దేవర సినిమా మరి బ్లాక్ బస్టర్ కాకపోయినా.. మంచి సక్సెస్ అయిన సినిమా. మరీ ఫ్లాప్ సినిమా అయితే కాదు. పైగా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన సినిమా. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ వాళ్లు సైతం సినిమా కోసం ముందుకు వచ్చి సపోర్ట్ చేయలేదు.
ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ గురించి ఒక్క హీరో కూడా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు చెప్పకపోవడం అందరికీ షాక్ ఇస్తుంది. ఎంత పైకి స్నేహితులుగా ఉన్నా.. సైలెంట్ గా ఉండటం ఇన్సెక్యూరిటీ వలనా అని కూడా కొంత కామెంట్లు వినిపిస్తున్నాయి.
Also Read: Festive Fashion: దసరా నాడు హీరోయిన్ల ట్రెడిషనల్ లుక్స్.. పండుగకు మరింత అందం
Also Read: Chandrababu: పండుగ రోజు కూడా పాలనలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఉల్లి, టమాట ధరపై శుభవార్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.