NTR: శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ సహా స్టార్ హీరోలు దూరం.. అసలు కారణం అదా?
Tollywood Top Heros Skipping NTR Satha Jayanthi Utsavalu: నందమూరి తారక రామారావు శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందులో భాగంగా కూకట్ పల్లిలో సభ ఏర్పాటు చేయగా యంగ్ హీరోలు సభకు డుమ్మా కొట్టినట్టు చెబుతున్నారు.
Tollywood Top Heros to Skip NTR Satha Jayanthi Utsavalu: దివంగత ముఖ్యమంత్రి, తెలుగు వారు అందరూ ఆరాధ్య దైవంగా భావించే నందమూరి తారక రామారావు శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులోని కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఒక భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు.. మే 20వ తేదీ సాయంత్రం ఈ సభ జరగబోతుందని ముందు నుంచే ప్రచారం జరిగింది.
దానికి తగ్గట్టుగానే ఈ సభకు తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలు అందరూ హాజరవుతారు అని కూడా ప్రచారం జరిగింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, కన్నడ సినీ పరిశ్రమ నుంచి శివ రాజ్ కుమార్ కూడా హాజరు కానున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నిర్వాహకుల. అల్లు అర్జున్, రామ్ చరణ్, హీరో రానా, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నితిన్ వంటి వారిని ఆహ్వానించారని దాదాపు వారందరూ హాజరవుతారని ముందు నుంచి ప్రచారం జరుగుతూ రాగా జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు ఈ రోజే కాబట్టి తాను వేడుకలు జరుపుకోవాలని తాతగారి శతజయంతి వేడుకలకు తాను హాజరు కాలేకపోతున్నానని మీడియా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ను ఈ వేడుకలకు హాజరు కమ్మని కోరినప్పుడే ఆయన నిర్వాహకులకు ఈ విషయం తెలియజేశారు. కానీ అది ఇప్పటివరకు బయటకు అయితే రాలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు ఇతర స్టార్ హీరోలు కూడా ఈ వేడుకకు డుమ్మా కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వాళ్లు రావడం లేదని నిర్వాహకులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలైతే కనబడుతున్నాయి.
కానీ హీరోలందరూ ఈ వేడుకకు దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారని దానికి ముఖ్య కారణం ఇటీవల రజనీకాంత్ మీద అధికార వైసీపీ చేసిన మాటల దాడి అని తెలుస్తోంది. ఇప్పుడు హాజరు కాకపోవడానికి ఇతర కమిట్మెంట్లు, షూటింగ్లు ఉన్నాయని చెబుతున్నా అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. మొన్న రజినీకాంత్ లాంటి స్టార్ హీరో వచ్చినప్పుడు ఆయన ఎన్టీఆర్ మీద చంద్రబాబు మీద ప్రశంసలు కురిపిస్తే అలాంటి స్థాయి ఉన్న నటుడు మీద భారీగా ట్రోలింగ్ జరిగింది. అధికార పార్టీ మంత్రుల సైతం విచ్చలవిడిగా కామెంట్లు చేశారు. ఇప్పుడు తాము హాజరైతే తమ మీద కూడా ఈ మాటల దాడి కొనసాగుతుందని తద్వారా ప్రజల్లో కాస్త నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడే అవకాశం ఉందని హీరోలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Also Read: Manushi Chhillar Photos: ఉల్లిపొర లాంటి చిట్టి గౌనులో అన్నీ కనిపించేలా మానుషి చిల్లర్ హాట్ ట్రీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook