టాలీవుడ్‌లో ఆ ఇద్దరి కాంబినేషన్ అద్భుతమైంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఇద్దరూ కలిసి మూడు సినిమాలు చేయడంతో..ఆ ఇద్దరూ ఇష్టపడ్డట్టే కన్పిస్తుంది. ఇప్పుడు ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ నటీ నటులైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ప్రేమలో ఉన్నారనే వార్త గత కొద్దికాలంగా వ్యాపిస్తోంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం సాగింది. ఈ ఇద్దరి ప్రేమ విషయమై చర్చ వచ్చిన ప్రతిసారీ..ఇద్దరం మంచి స్నేహితులం, అంతకుమించింది ఏమీ లేదంటా సమాధానాలు కూడా ఇచ్చారు. ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ కూడా వెళ్లొచ్చారు. ఇక అప్పట్నించి ఇద్దరి మధ్య ప్రేమాయణంపై గాసిప్స్ అధికమయ్యాయి. ఇద్దరూ డేటింగ్ ఎప్పుడు కన్ఫామ్ చేస్తారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నలు కూడా వచ్చాయి.


వీటికితోడు ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫోటో వైరల్ అవడంతో..ఇద్దరూ అనుకున్నట్టే పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు. అయితే ఈ ఫోటోను కాస్త నిశితంగా పరిశీలిస్తే అసలు సంగతి అర్దమౌతుంది. ఈ ఫోటో మార్ఫింగ్ ఫోటోగా స్పష్టమౌతోంది.


అయితే ఈ ఫోటోలో ఉన్న దృశ్యం నిజ జీవితంలో కూడా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ 3 సినిమాలు వచ్చాయి. మిస్టర్ కామ్రేడ్, గీత గోవిందం, వరల్డ్ ఫ్యామస్ సినిమాల్లో ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది.


Also read: Shock to Samantha: నాగచైతన్య పుట్టినరోజు నాడే సమంతకు ఊహించని షాకిచ్చిన కోర్టు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook