Producer Katragadda Murari Death  :   టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) కాసేపటి క్రితం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసం నేటి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ విషాదంలో నెలకొంది. ఆయన తన కెరీర్‌లో ఎన్నెన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీతారామ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, జానకీ రాముడు, నారీ నారీ నడుము మురారి అనే చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మీద తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన తన జీవిత చరిత్ర ఆధారంగా రాసుకున్న ఆత్మకథలో సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలను కూడా రచించారు. ఆయన రాసుకున్న ఆత్మకథ నవ్విపోదురుగాక పుస్తకం అప్పట్లో ఒక సంచలనం. అయితే అది అత్యంత వివాదస్పదం కావడంతో  నవ్విపోదురుగాక  పుస్తకం  అమ్మకాలను నిలిపివేశారు.


ఇక ఆయన తీసిన చిత్రాల్లో సంగీతం ప్రధానంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయన చిత్రాల్లో ఎక్కువగా కేవీ మహదేవన్ స్వరపరిచినవే. ఈయన విజయవాడలోని మొగల్రాజపురంలో 1944వ సంవత్సరంలో జన్మించారు. ఎంబీబీఎస్ చదివిన ఆయన సినిమా రంగం మీదున్న మక్కువతో మద్రాసు వెళ్లి నిర్మాతగా మారారు.


Also Read : ముందు నుంచి ఊహించినా షాకింగ్ గానే ఈవారం ఎలిమినేషన్.. ఎవరు అవుట్ అయ్యారంటే?


Also Read : Jitendra Shastri Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడి ఆకస్మిక మృతి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook