Bigg Boss 6 Elimination: ముందు నుంచి ఊహించినా షాకింగ్ గానే ఈవారం ఎలిమినేషన్.. ఎవరు అవుట్ అయ్యారంటే?

Bigg Boss 6 Telugu Elimination This Week: బిగ్ బాస్ హౌస్ నుంచి ఎప్పటిలాగే లీక్స్ బయటకు వచ్చాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయం ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 15, 2022, 08:13 PM IST
Bigg Boss 6 Elimination: ముందు నుంచి ఊహించినా షాకింగ్ గానే ఈవారం ఎలిమినేషన్.. ఎవరు అవుట్ అయ్యారంటే?

Bigg Boss 6 Telugu Elimination This Week: తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్కు ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం నాగర్జున ఒక హౌస్ మేట్ ని ఎలిమినేట్ చేస్తారు. అయితే ఆ షూటింగ్ అంతా శనివారం జరుగుతుంది కాబట్టి శనివారం సాయంత్రమే ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని లీక్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి.

ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం లీక్ అయింది. వాస్తవానికి ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రకారం కీర్తి బట్, ఆదిరెడ్డి, గీతూ రాయల్, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, రాజశేఖర్, శ్రీ సత్య, మెరీనా ఉన్నారు. ఇక బిగ్ బాస్ అనఫీషియల్ ఓటింగ్ లెక్కల ప్రకారం శ్రీహాన్, ఆదిరెడ్డి, గీతూ, శ్రీ సత్య ఓటింగ్లో మంచి శాతం తెచ్చుకోవడమే కాక టాప్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఇక వీరు కాకుండా రాజశేఖర్, కీర్తికి కూడా బాగానే ఓట్లు దక్కినట్టుగా ప్రచారం జరుగుతోంది.

అయితే సుదీప, మెరీనా, బాలాదిత్య డేంజర్ జోన్ లో పడ్డారు. ఈ ముగ్గురిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని నామినేషన్స్ అయినప్పటి నుంచి బిగ్ బాస్ రివ్యూయర్లు పెద్ద ఎత్తున తమ విశ్లేషణలు వినిపించారు. ఇక మెరీనా తన భర్తతో కాస్త రొమాన్స్ పండిస్తూ అప్పుడప్పుడూ గొడవలు పడుతూ కంటెంట్ ఇస్తోంది కాబట్టి ఆమెను కూడా సేఫ్ చేశారు. ఇక అయితే బిగ్ బాస్ లో ఈ వారం హౌస్ మేట్స్ కోసం తన సిగరెట్లు త్యాగం చేసిన బాలాదిత్య ప్రేక్షకులలో సింపతి కొట్టేశారు.

దీంతో అతనిని కొనసాగించాలని బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చివరిగా సుదీప, బాలాదిత్య ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితులలో సుదీపను ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్న సుదీప ఈ బిగ్ బాస్ తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావించింది. అయితే ఆమె ఇలా అర్ధాంతరంగా బయటికి వచ్చేస్తుందా? లేదా? అనేది రేపు రాత్రి ఆదివారం నాడు ప్రసారమయ్యే ఎపిసోడ్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read: Vijay Devarakonda at Uri: ఆర్మీ జవాన్లతో దేవరకొండ ఫోటోలు.. 'జనగణమన' అనుమానాలు?

Also Read: Jitendra Shastri Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడి ఆకస్మిక మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News