Jitendra Shastri Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడి ఆకస్మిక మృతి!

Jitendra Shastri Passed Away: సినీ పరిశ్రమలో వరుస మరణాలు విషాదం నింపుతున్నాయి, బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన జితేంద్ర శాస్త్రి మరణించారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 15, 2022, 06:29 PM IST
Jitendra Shastri Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడి ఆకస్మిక మృతి!

Jitendra Shastri Passed Away: సినీ పరిశ్రమలో మరోమారు తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హిందీ నటుడు జితూ శాస్త్రి అలియాస్ జితేంద్ర శాస్త్రి కన్నుమూశారు. ఆయన శనివారం ఉదయం ఈ లోకానికి వీడ్కోలు పలికారు. జితేంద్ర శాస్త్రి బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు పొందిన అతి తక్కువ మంది నటులలో ఒకరు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.   జితేంద్ర శాస్త్రి  తన కెరీర్‌లో కొన్ని మంచి పాత్రలు పోషించారు.

సినిమా రంగంలోనే కాకుండా నాటకరంగంలో కూడా ఆయనకు మంచి పేరు ఉంది. జితేంద్ర నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుని 'లజ్జా', 'దౌర్', 'చరస్', 'బ్లాక్ ఫ్రైడే' వంటి అనేక సూపర్ హిట్ సినిమాలలో భాగమయ్యారు. ఆయన 2019లో అర్జున్ కపూర్ నటించిన  'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' సినిమాకు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాయే ఆయన నేపాల్‌లో ఉన్న ఇన్‌ఫార్మర్ పాత్ర పోషించాడు, ఒక పేరుమోసిన ఉగ్రవాదిని పట్టుకోవడంలో సహాయం చేస్తారు.

ఈ పాత్రకు ఆయనకు ప్రశంసలు కురిపించడమే కాదు మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. ఇక జితేంద్ర 'కైద్-ఎ-హయత్', 'సుందరి' వంటి ఎన్నో గొప్ప నాటకాలలో కూడా నటించారు. బాలీవుడ్‌లోని ప్రముఖ నటుల్లో ఒకరైన సంజయ్ మిశ్రా తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి జితేంద్ర శాస్త్రితో కలిసి ఉన్న పాత వీడియో పంచుకున్నారు. వీడియోను పంచుకున్నారు. టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి నటుడు జితేంద్ర శాస్త్రి మరణంపై సంతాప సందేశాన్ని షేర్ చేసింది.

సినిమాల్లో చాలా వరకు ఆయన నటించిన పాత్రలు పెద్దవి కాకపోయినా చిన్న పాత్రల్లో మాత్రం తనదైన శైలిలో తనదైన ముద్ర వేసేవారు. ఇక ఆయన మరణవార్తతో వినోద ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వార్త తెలియగానే అభిమానులు, తారలు సోషల్ మీడియాలో నివాళులర్పిస్తున్నారు.  నటుడు రాజేష్ తైలాంగ్ కూడా జితేంద్ర శాస్త్రి మృతికి సంతాపం తెలియజేశారు, చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. నటుడు రాజేష్ తైలాంగ్ కూడా జితేంద్ర శాస్త్రి మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులర్పించారు. అయితే జితేంద్ర శాస్త్రి మృతికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు. జితేంద్ర శాస్త్రి నాటకరంగంలో కూడా సుపరిచితమైన పేరు. హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే పోషించాడు. అయితే ఈ పాత్రల్లో జీతూ శాస్త్రి తన బలమైన నటనతో మంచి పేరు సంపాదించారు. 
Also Read: Rishab Shetty- Jr NTR: కాంతార హీరో ‘రిషబ్ శెట్టి’కి ఎన్టీఆర్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Also Read: Garikipati Counter: ‘గరిక’ కామెంట్స్ పై అనంతశ్రీరాంకి గరికపాటి స్ట్రాంగ్ కౌంటర్.. మాములుగా ఇవ్వలేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News