Tragic Ending to Rashmika's Srivalli Role : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాని మొదట ఒక భాగంగానే తీయాలని అనుకున్నారు. కానీ సినిమా మొదలు పెట్టిన తర్వాత నిడివి పెరిగి పోతూ ఉండడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొదటి భాగంలో ఒక సామాన్య వ్యక్తి విదేశాలకు సైతం ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే డాన్ గా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని చూపించారు. రెండో భాగంలో డాన్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? ఎంతటి దూరాలకు వెళ్ళాడు అనే విషయాన్ని చూపించబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాలు అలాగే మిగతా ప్రపంచం మొత్తం మీద లెక్క వేసుకుంటే ఎక్కువగా నార్త్ ఆడియెన్స్ సినిమాను బాగా ఆదరించారు. ఈ నేపథ్యంలోనే నార్త్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా రెండో భాగాన్ని కూడా రూపొందించాలి అని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయం తీసుకోవడానికి కే జి ఎఫ్ టు సినిమా కూడా ఒక కారణమే. ఎందుకంటే ఈ సినిమా కూడా కన్నడ సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చి  నార్త్ లో మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఎలా అయినా ఆ సినిమా లాగానే రెండో భాగానికి కూడా భారీ ఎత్తున వసూళ్లు సాధించాలని నిర్మాతలు సుకుమార్ ని కోరడంతో ఆయన కథ విషయంలో మరిన్ని మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. 


ఇక తాజాగా జరిగిన మార్పుల ప్రకారం ఈ సినిమాలో రష్మిక పాత్ర విషయంలో అన్యాయం జరుగబోతుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అదేమిటంటే సుకుమార్ తాజాగా చేసిన మార్పులు చేర్పుల ప్రకారం రష్మిక పోషించిన శ్రీ వల్లి అనే పాత్రను పోలీసులు ఇన్ఫార్మర్ గా వాడుకుంటారు అని తెలుస్తోంది .  భర్తను ప్రాణాలతో వదిలివేయాలి అంటే అతనిని ప్రాణాలతో మాకు అప్పగించాలి అంటూ ఆమెను నమ్మించి ట్రాప్ చేస్తారని తెలుస్తోంది.


అయితే అనుకోకుండా ఈ ట్రాప్ కారణంగా స్వయంగా శ్రీవల్లి మృత్యువాత పడేలా సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. ఒకరకంగా రష్మిక పాత్రను ట్రాజిక్ ఎండింగ్ తో ముగించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయం మీద రష్మిక అభిమానులైతే అలా చేయడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు అయితే ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో తెలియకుండా ముందే ఒక డెసిషన్ కి రావడం అయితే కరెక్ట్ కాదు. ఈ సినిమా విడుదలైతే కానీ అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదని అంటున్నారు. 


Also Read: Rashmika mandanna: శ్రీవల్లి రోజు రోజుకు ఇంత క్యూట్​గా


Also Read: Rashmika Mandanna Net Worth : రష్మిక ఆస్తి అన్ని కోట్లా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook