Rashmika Mandanna Net Worth : రష్మిక ఆస్తి అన్ని కోట్లా? ఒక్కో సినిమాకి అంత తీసుకుంటుందా?

Rashmika Mandanna: పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అంతలా నేషనల్ క్రష్ గా మారిపోయిందని ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో...ఈ బ్యూటీ రెమ్యూనరేషన్, సంపాదన గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 04:31 PM IST
  • నేషనల్ క్రష్ గా రష్మిక మందన్నా
  • ఇటీవల రేంజ్‌ రోవర్‌ కారును కొనుగోలు చేసిన రష్మిక
  • 'పుష్ప 2' ఘాటింగ్ లో బిజీ ఉన్న బ్యూటీ
Rashmika Mandanna Net Worth : రష్మిక ఆస్తి అన్ని కోట్లా? ఒక్కో  సినిమాకి అంత తీసుకుంటుందా?

Rashmika Mandanna Net Worth : సౌత్ ఇండియా అగ్రకథానాయికల్లో రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒకరు. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ... గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో ఒక్కసారిగా తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు వెనుదిరిగి చూసుకోకుండా పోయింది. వరుస సినిమా ఆఫర్లతో బిజీ అయిపోయింది. టాలీవుడ్  నుంచి బాలీవుడ్ దాకా వరుస సినిమాలను లైన్ లో పెట్టింది. తాజాగా బిగ్ బీ అమితాబ్ తో నటించే అవకాశం కొట్టేసింది. 

గతేడాది పుష్ప (Pushpa) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు నేషనల్ క్రష్‌గా మారిపోయింది. అయితే ఒక్కో సినిమాకు రష్మిక ఎంత తీసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమె ఆస్తి గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ఒక్కో  సినిమాకు రూ.4 నుంచి 5కోట్లు వరకు రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఒక్కో  ప్రకటనకి రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికి వరకు ఈ అమ్మడు సంపాదించిన నికర ఆస్తుల విలువ (Rashmika Mandanna Net Worth) రూ. 37 కోట్లుగా తేలినట్లు తెలుస్తోంది. ఇక ఏడాదికి ఈ బ్యూటీ సుమారు రూ. 5 మిలియన్లు(అంటే రూ. 21కోట్ల 65 లక్షలు) సంపాదిస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు ఇటీవల రష్మిక ఖరీదైన రేంజ్‌ రోవర్‌ బ్లాక్‌ లగ్జరీ కారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  దీని విలువ కోటి రూపాయలపైనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. 1996 ఏప్రిల్‌లో పుట్టిన రష్మిక ప్రస్తుత వయసు 25 ఏళ్లు. ఇంత చిన్న ఏజ్ లో అంత మెుత్తం సంపాదించిందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఆమె నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' (Aadavallu Meeku Joharlu) మూవీ మార్చి 4న రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Also Read: Mahesh Babu-Sitara: కూతురి స్టెప్పులకు సూపర్ స్టార్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News