Two Souls Trailer కొత్త కంటెంట్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. టూ సోల్స్ అంటూ విభిన్న కథా కథనాలతో ఓ సినిమా రాబోతోంది. ఎందుకంటే ప్రేమంటే సినిమాలోని పాయింట్ కూడా ఇదే. అయితే ఇందులో రెండు ఆత్మలు కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలు పెంచినట్టు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రావణ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టు సోల్స్ టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 



ఈ ట్రైలర్‌ను చూస్తుంటే.. కొత్త కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ప్రేమ అనేది రెండు ఆత్మల మధ్య చిగురించినట్టుగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా నటించగా.. రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డిలు ఇతర పాత్రల్లో కనిపించారు.


Also Read:  IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా


రెండు ఆత్మల మధ్య పరిచయం ఎందుకు ఏర్పడింది?ఎలా ఏర్పడింది? వారి ప్రయాణం చివరకు ఎక్కడి వరకు వెళ్లింది? చివరకు ఏం జరిగింది? అంటూ ఇలా ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ ఉంది. ఇక రేపు ఈ సినిమా ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. సినిమా అంతా కూడా నార్త్‌లోనే తీసినట్టుగా అనిపిస్తుంది. లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీకి ప్రతిక్ అబ్యంకర్ అండ్ ఆనంద్ నంబియార్ మ్యూజిక్ అందించగా.. శశాంక్ శ్రీరామ్  సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.


Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook