How to make Rosemary Water for Hair growth: జుట్టు సంబంధిత సమస్యలకు రోజ్మెరీ వాటర్ విపరీతంగా ఉపయోగిస్తారు. సౌందర్యపరంగా కూడా వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యగా ఈ నీటితో మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. దీంతో జుట్టుకు అనేక పోషకాలు లభిస్తాయి. డ్యాండ్రఫ్ సమస్యలకు చెక్ పెడతాయి. రోజ్మెరీ వాటర్ తో మీ జుట్టుపై రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యలను కూడా తగ్గించేస్తుంది. మన జుట్టు కుదళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కూడా రోజ్మెరీలో పుష్కలంగా ఉంటాయి. ఇది మన జుట్టును మందంగా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. హెయిర్ ఫొలికల్స్ కూడా బలంగా మారడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఈ రోజ్మెరీ నీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
రోజ్మెరీ వాటర్ తయారీ విధానం..
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ ప్యాన్ పెట్టుకోండి ఇందులో మూడు కప్పుల నీరు పోసి మీడియం మంటపై మరిగించండి. ఆ నీరు ఉడుకుతున్నప్పుడు మంట తగ్గించేయండి. ఇప్పుడు అందులో మూడు రోజ్మెరీ కాడలను వేయండి. ఇప్పుడు ఓ మూత పెట్టేసి మరో 20 నిమిషాల పాటు సిమ్ లో ఉడికించండి.
ఇదీ చదవండి: బెల్లీఫ్యాట్ తగ్గించే గ్రీన్‌మ్యాజిక్.. యాలకులు కొవ్వును కరిగించే సరైన ఆయుధం..
ఓ పదిహేను నిమిషాల తర్వాత నీరు చిక్కగా మారిపోతుంది ఇప్పుడు రోజ్మెరీ వాటర్ తయారైనట్లే ఇందులో మీరు కావాలంటే లవంగాలు కూడా యాడ్ చేయవచ్చు. ఇందులో యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి. ప్యాన్ స్టవ్ పై నుంచి తీసి ఓ 30 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ రోజ్మెరీ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు రోజ్మెరీ వాటర్ రెడీ దీన్ని వారానికి కనీసం మూడు సార్లు అయినా జుట్టుకు స్ప్రే చేసుకుంటూ ఉండాలి.
ఇదీ చదవండి: ఓపెన్ పోర్స్ ఎక్కువయ్యాయా? ఇంట్లో తయారు చేసిన ఈ ఫేస్‌ఫ్యాక్ సూపర్ రెమిడీ..
మీ జుట్టును ముందుగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రోజ్మెరీ వాటర్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే, ఏది మన ముఖానికి జట్టుకు అప్లై చేసుకున్న ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ రోజ్మెరీ నీటిని షాంపూ చేసుకునే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. హయిర్ మాస్క్ వేసుకున్న తర్వాత కండీషన్ గా కూడా వాడొచ్చు. ఒకవేళ మీరు రోజ్మెరీ నూనె వాడకుంటే రోజ్మెరీ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి