Trisha Krishnan Clarity on Her Political Entry: తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన త్రిష కృష్ణన్ తమిళ సినీ పరిశ్రమ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత తమిళ, తెలుగు, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మిస్ చెన్నై కాంటెస్ట్ లో గెలిచిన తర్వాత ఆమె సినీ పరిశ్రమలో ఎంట్రీ వచ్చింది. తమిళంలో జోడి అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 అనే సినిమాని తెలుగులో నీ మనసు నాకు తెలుసు పేరుతో రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే ఆమెకు మొట్టమొదటి టాలీవుడ్ మూవీ.  ఇక అదే ఏడాది వర్షం అనే సినిమాలో శైలజా పాత్రలో చేసిన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కించుకుంది. ఇక ఆ తర్వాత ఆమెకు తమిళ, తెలుగు సినిమాలతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, అల్లరి బుల్లోడు, పౌర్ణమి, బంగారం, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు, శంఖం, నమో వెంకటేశా, ఏం మాయ చేసావే, తీన్మార్, బాడీగార్డ్, దమ్ము, లయన్, చీకటి రాజ్యం, నాయకి వంటి సినిమాల్లో నటించింది. నాయకి తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో కనిపించలేదు.


ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో తమ పార్టీని బలపరుచుకునే ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆమె కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తమిళ సినీ పరిశ్రమకు రాజకీయ రంగానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్న నేపథ్యంలో తమ అభిమాన హీరోయిన్ కూడా అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని అందరూ భావించారు.


కానీ తాజాగా ఈ విషయం మీద త్రిష తల్లి ఉమా కృష్ణన్ స్పందించారు. తన కుమార్తెకు పాలిటిక్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని అసలు తమ కుటుంబానికి పాలిటిక్స్ అంటే పడవని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఇంకా తన కూతురికి మంచి భవిష్యత్తు ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై స్పందించిన త్రిష అసలు ఎలాంటి ఆధారం లేకుండా ఇలా పుకార్లు ఎలా పుట్టిస్తారో, నాకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
 Also Read: Koratala Siva New Story for Jr NTR: ఆచార్య ఝలక్... కీలక నిర్ణయం తీసుకున్న కొరటాల శివ!


Also Read: Movie Shootings Started: ఎమర్జన్సీ కోటాలో టాలీవుడ్ షూటింగ్స్ మొదలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి