Trisha issues legal warning


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు భాషతో పాటు తమిళంలో కూడా ఎంతో పేరు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష. ముందుగా తమిళ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త్రిష ఆ తరువాత తెలుగులో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు తెలుగు, తమిళ భాషలలో అందరూ స్టార్ హీరోలతోనూ నటించింది. అయితే గత కొద్దిరోజులగా త్రిష పేరు వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. కానీ ఇందుకు కారణం సినిమాలు కావు. ఆమెపై పలు వ్యక్తులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు.


గత దశాబ్దా కాలంగా తన స్టార్ స్టేటస్ ని అలాగే మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్న త్రిష పైన ఈ మధ్య కొంతమంది కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పై వస్తున్న కొన్ని లైంగిక కామెంట్స్.. ఆమెతో పాటు అభిమానులను, సెలబ్రిటీస్‌ని సైతం ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇటీవల విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా వచ్చిన ‘లియో’ సినిమా సమయంలో నటుడు మన్సూర్ అలీఖాన్ త్రిష పైన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.


ఆ విషయంలో మన్సూర్ ని న్యాయస్థానం గట్టిగా మందలించడంతో ఆ వివాదం అక్కడితో పూర్తయింది. ఇక ఆ విషయం నుంచి త్రిష అభిమానులు బయటపడేలోపే.. ఇప్పుడు మరో వ్యక్తి త్రిష పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసి మరోసారి త్రిష అభిమానులను ఆగ్రహానికి గురి చేశారు.. అసలు విషయానికి వస్తే తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ లీడర్.. త్రిష పై కొన్ని అసభ్యకర కామెంట్స్ చేసాడు. వేరే పార్టీ పొలిటీషియన్ డబ్బులిచ్చి త్రిషని రిసార్ట్‌కు పిలుపించుకున్నారంటూ కొంచెం ఘాటుగా మాట్లాడారు తమిళ పొలిటీషియన్ ఏవి రాజు. ఇక ఈ వ్యాఖ్యలు పై త్రిష అభిమానులతో పాటు విష కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ త్రిష ట్వీట్ చేసారు. “దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారిపోయే నీచమైన మనుషులను పదేపదే చూడటం చాలా అసహ్యంగా ఉంది. దీనిపై అవసరమైన, కఠినమైన చర్యలు తప్పకుండా లీగల్ గా తీసుకోబడతాయి. ఇకపై చెప్పవల్సింది, చేయవల్సింది అంతా నా న్యాయ విభాగం నుండి ఉంటుంది” అంటూ త్రిష గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.


 



కాగా దీనిపై ఏవి రాజు స్పందిస్తూ త్రిషని క్షమాపణలు కోరారు. మరి ఆయన క్షమాపణపై ఈ హీరోయిన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ హీరోయిన్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.


Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన


Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook