COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Trisha OTT News: త్రిష హీరోయిన్ గా గత 20 యేళ్లుగా కథానాయికగా దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈమె ‘బృంద’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.  చెడుపై మంచి సాధించిన విజయం నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొంచినట్టు తెలుస్తుంది.  సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్‌ స్ట్రీమింగ్ కు రానుంది.  తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో ఈ సీరీస్‌ ను చూడొచ్చు.  


సీరీస్‌ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ..
‘సోనీ లివ్‌’ ద్వారా ప్యాన్‌ ఇండియా ఆడియన్స్‌ని బృంద సీరీస్‌తో  పలకరించడం  థ్రిల్‌గా ఉందన్నారు. బృంద సిరీస్ మొత్తం  సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగిపోతుంది. అనూహ్యమైన మలుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. బృంద సీరీస్‌ చూస్తున్నంత సేపు చివరి వరకు చూపు తిప్పుకోలేరు. మహిళా ఇతివృత్తంతో ఈ సిరీస్ ను తెరకెక్కించినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో త్రిషకు ఇందులో ఈ సిరీస్ కోసం సరికొత్తగా ట్రాన్స్ ఫామ్ అయిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  





టాలెంటెడ్‌ సౌత్‌ క్వీన్‌ త్రిష కృష్ణన్‌ ఈ సీరీస్‌తోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సూర్య మనోజ్‌ వంగాలా, పద్మావతి మల్లాది కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లే ఈ సీరీస్‌కి హైలైట్‌ కానుంది. శక్తికాంత్‌ కార్తిక్‌ మ్యూజిక్ అందించారు.  అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైన్‌ చేశారు. దినేష్‌ కె బాబు సినిమాటోగ్రఫీ అందించారు. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాష్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సీరీస్‌లో లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. డ్రామా, క్రైమ్‌, మిస్టరీ అంశాలతో... చూసినంత సేపూ ఒళ్లు గగుర్పొడిచేలా సాగుతుంది బృంద సీరీస్‌. ప్రతి సెకనూ ఉత్కంఠ రేపే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ని చూడటానికి ఆగస్టు 2 వరకు ఆగాల్సిందే. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో సోనీ లివ్‌లో అందుబాటులో ఉండనుంది.


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి