Trisha: వరస ప్లాపులతో సతమతమవుతున్న చిరంజీవి ప్రస్తుతం తన ఆశలన్నీ విశ్వంభర సినిమా పైన పెట్టుకున్నారు. మధ్యలో వాల్తేరు వీరయ్య చిత్రం చిరంజీవికి మంచిది విజయం అందించిన ఆ సినిమా కథ కూడా మెగా అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ చిత్రం కూడా చిరంజీవి రేంజ్ సినిమా కాదని ఎంతోమంది దగ్గర నుంచి కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్  తన 156వ సినిమా బింబిసార లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు వశిష్ఠ చేతిలో పెట్టారు. విశ్వంభర అనే టైటిల్ ఫస్ట్ ఉన్న ఈ చిత్రం టైటిల్ కాన్సెప్ట్ వీడియో ఈ మధ్యనే రిలీజ్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమా బియాండ్ యూనివర్స్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. విశ్వంభర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమా హీరోయిన్ కూడా ఈ సినిమా సెట్స్  లోకి ఎంట్రీ వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో చిరంజీవి లేని కొన్ని సీన్స్ షూటింగ్ జరుగుతూ వచ్చింది. కాగా ఇటీవలే చిరంజీవి విశ్వంభర సెట్స్ లోకి అడుగు పెట్టారు. కొన్ని రోజుల క్రితమే తన ట్విట్టర్ అకౌంట్ లో జిమ్ లో బాగా కష్టపడుతున్న వీడియోని షేర్ చేసి విశ్వంభర మొదలుపెడుతున్నాను అని చిరంజీవి పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక రెండు రోజుల క్రితమే ఈ చిత్రం షూటింగ్ కి చిరంజీవి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు హీరోయిన్ త్రిష కూడా ఎంట్రీ వచ్చింది.


 



తాజాగా ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తున్నట్టు అధికారికంగా అప్రకటించారు. నేనే ఉపాధ్యాయులు త్రిష విశ్వంభర సెట్స్ లోకి అడుగు పెట్టగా చిరంజీవి, మూవీ యూనిట్ త్రిషకు వెల్కమ్ చెప్పారు. చిరంజీవి ఒక బొకే ఇచ్చి మరి ఈ హీరోయిన్ కి వెల్కమ్ చెప్పాడు. అంతేకాదు ఈ వీడియోని చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ కూడా చేశారు. ఇక ఈ వీడియో చూసి మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. వీరిద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో కలిసి నటించగా ఇప్పుడు మళ్ళీ..దాదాపు 18 సంవత్సరాల తరువాత మరలా ఈ ఇద్దరిని స్క్రీన్ పైన చూడొచ్చు అని ఖుషి అవుతున్నారు.


Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్‌ కాస్కో అంటూ సవాల్‌ విసిరిన హరీశ్‌ రావు


Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook