Trisha receive UAE’s golden visa: త్రిషకు యూఏఈ గోల్డెన్ వీసా- తమిళ నటిగా అరుదైన ఘనత
Actress Trisha: తమిళ నటిగా త్రిష అరుదైన ఘతను సొంతం చేసుకున్నారు. యూఏఈ గోల్డెన్ వీసా అందుతున్న దక్షిణాది తొలి లేడీ యాక్టర్‌గా ఘనతను సాధించారు.
Trisha receive UAE’s golden visa: స్టార్ హీరోయిన్ త్రిషకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఇచ్చే గోల్డెన్ వీసాను (Trisha Gets Golden Visa) అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష ఘనతను సొంతం చేసుకున్నారు.
త్రిష అధికారికంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటిని అయినందుకు (Trisha is First Tamil Actor Who Get Golden Visa) సంతోషంగా ఉందటూ ఆమె ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.
ఏమిటి ఈ గోల్డెన్ వీసా?
అంతర్జాతీయంగా ఉన్న కొత్త ప్రతిభని ప్రోత్సహించి.. సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు యూఏఈ (What is Golden Visa) కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. సినిమా సహా వివిధ రంగంలోని ప్రముఖులకు అక్కడ ఎక్కువ రోజులు బస చేయాలంటే.. వీసా ఇబ్బందులు లేకుండా.. ఈ గోల్డెన్ వీసా విధానాన్ని తీసుకొచ్చింది. 2019 నుంచి ఈ విధానం సాగుతోంది. ఈ వీసాను 5 లేదా 10 ఏళ్ల సుదీర్ఘ కాలానికి జారీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. దీనితో పాటు ఆటో రెన్యువల్ సదుపాయం కూడా ఉంది.
ఈ వీసా ఇస్తే.. స్టార్ యాక్టర్లు దుబాయ్‌లో ఎక్కువ రోజులు ఉంటారని.. ఫలితంగా సినిమా, టూరిజం పరంగా కలిసొస్తుందని యూఏఈ భావిస్తోంది.
Also read: F3 Movie: సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న ఎఫ్3.. దీపావళి స్పెషల్ వీడియో రిలీజ్
Also read: Khiladi Title Song: ఖిలాడి టైటిల్ సాంగ్ విడుదల- సినిమాపై అంచనాలు పెంచుతున్న వీజువల్స్, లిరిక్స్
ఇంకా ఎవరెవరికి గోల్డెన్ వీసా ఉంది..
బాలీవుడ్ స్టార్లు.. షారుఖ్ ఖాన్, బోనీ కపకూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ సహా పలువురికి ఈ వీసా ఉంది.
దక్షిణాదిలో మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ వంటి యాక్టర్లు గోల్డెన్ వీసాను కలిగి ఉన్నారు. ఇప్పుడు త్రిషకు ఈ వీసా ఇచ్చింది యూఏఈ ప్రభుత్వం.
Also read: Mega family Diwali celebrations : మెగా ఫ్యామిలీలో దీపావళి సందడి
త్రిష గురించి..
1999లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన త్రిష.. తొలుత చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ.. గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్గా తమిళం, తెలుగు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. రెండు భాషల్లో అగ్ర హీరోలందరి సరసల హీరోయిన్గా నటించారు త్రిష. ప్రస్తుతం హీరియిన్ ఓరియంటెడ్, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు. 2016లో వచ్చిన నాయకి సినిమాలో చివరి సారిగా తెలుగు స్క్రీన్‌పై కనిపించారు త్రిష. ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు.
Also read: Acharya second single : దీపావళి కానుకగా ‘ఆచార్య’ నుంచి సెకండ్ సింగల్ ప్రోమో
Also Read : Akhanda title song teaser: అఖండ టైటిల్ సాంగ్ టీజర్ వచ్చేస్తోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook