Trisha:సౌత్ బ్యూటీ త్రిష గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన చేసిన 'వర్షం'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోయిన్‌గా కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంది. స్టార్‌డమ్ అనుభవిస్తూనే ఉంది. కానీ ఈ మధ్య త్రిష సినిమాల్లో కంటే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. ఆ మధ్య తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్.. త్రిషపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత న్యాయస్థానం జోక్యంతో ఆ వివాదం ముగిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన్సూర్ అలీ ఖాన్ వివాదం సద్దుమణకముందే.. తమిళనాడుకు చెందిన ఏవీ రాజు .. త్రిషపై చేసిన వ్యాఖ్యలు తమిళనాడుతో పాటు దేశాన్ని ఓ కుదుపు కుదేపేసింది. ఓ లీడర్‌కు రూ.25 లక్షలు ఇచ్చి త్రిషను తన రిసార్ట్‌కు పిలిపించుకున్నట్టు సదురు నేత మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై త్రిష సహా ఆమె అభిమానులతో పాటు మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయమై సదరు లీడర్ ఏదో మద్యం మత్తులో తాగి తూలానంటూ క్షమాపణలు కూడా చెప్పాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో త్రిష.. సదురు నేతపై పరువు నష్టం కేసును దాఖలు చేయడంతో పాటు అతనికి లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులో కోట్లలో నష్ట పరిహారంతో కోరడం జరిగింది. ఈ సందర్భంగా రాజు 24 గంటల్లో త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అంతేకాదు ఈ క్షమాపణాలు జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలతో పాటు తమిళ, ఇంగ్లీష్‌ భాషలకు సంబంధించిన డిజిటల్, ప్రింట్, ఎలక్రానిక్ మీడియా ఛానెల్‌లలో క్షమాపణాలు కోరినట్టు వార్తలు రావాలని పేర్కొంది.


ఈ సంబంధిత ప్రక్రియ చేయడంలో సదరు నేత విఫలమైతే.. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొంది. త్రిష తీసుకున్న ఈ చర్యల వల్ల ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా మద్ధతు తెలుపుతున్నారు. త్రిష విషయానికొస్తే..లాస్ట్ ఇయర్ విజయ్ హీరోగా నటించిన 'లియో'లో కథానాయికగా నటించింది. అటు పొన్నియన్ సెల్వన్ 2లో మెరిసింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీలో కథానాయికగా నటిస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత చిరు సరసన త్రిష నటించడం విశేషం.


Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!


Also Read: Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter