టాప్ హీరోయిన్లతో మూడేసి సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్.. అప్పుడు సమంత ఇపుడు పూజ హెగ్డే!!
పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హిట్ సెంటిమెంట్‌గా బావిస్తున్నాడేమో. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు మరోసారి బుట్టబొమ్మనే తీసుకున్నాడు.
Trivikram Srinivas repeats Pooja Hegde for his consecutive Movies: సినీ పరిశ్రమలో హిట్ కాంబినేషన్ చాలా చాలా ముఖ్యం. ఒకేసారి ఓ కాంబినేషన్‌లో హిట్ పడితే.. అదే రిపీట్ చేయడానికి ఇష్టపడతారు. ఆ కాంబినేషన్ హీరో-డైరెక్టర్, హీరో-హీరోయిన్, డైరెక్టర్-హీరోయిన్, డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఏదైనా కోవొచ్చు. తెలుగులో వెంకటేష్-సౌందర్య, చిరంజీవి-విజయశాంతి, బాలకృష్ణ-సిమ్రాన్, పూరిజగన్నాథ్-రవితేజ, వీవీ వినాయక్-జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి-ప్రభాస్.. ఇలా హిట్ కాంబినేషన్‌లు చాలానే ఉన్నాయి. ఇదే ఫాలో అవుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబో ఇప్పటికే పాపులర్ అయింది. తాజాగా పూజా హెగ్డేను ఆయన రిపీట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాలో పూజాకు మంచి పాత్రే దక్కింది. అంతేకాదు తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన 'అల వైకుంఠపురంలో' కూడా పూజానే తీసుకున్నాడు త్రివిక్రమ్. ఆ కాంబో కూడా హిట్ అయింది. బుట్టబొమ్మగా అందాల ప్రదర్శన చేసి ఆకట్టుకుంది.
పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హిట్ సెంటిమెంట్‌గా బావిస్తున్నాడేమో. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు మరోసారి బుట్టబొమ్మనే తీసుకున్నాడు. మహేష్ 28వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అధికారికంగా లాంచ్ అయిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు పూజా కూడా వచ్చింది. మొత్తానికి త్రివిక్రమ్-పూజాలకు ఇది హ్యాట్రిక్ సినిమా. ఇది కూడా హిట్ అయితే పూజా రేంజ్ మరింత పెరగనుంది.
గతంలో సమంతను రిపీట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈసారి పూజా హెగ్డేను రిపీట్ చేస్తున్నాడు. అఆ, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో సమంతను త్రివిక్రమ్ రిపీట్ చేశాడు. వరుసగా మూడో చిత్రానికి కూడా పూజాను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. 'మూడు ఏమన్నా లక్కీ నంబర్ హా త్రివిక్రమ్', 'అప్పుడు సమంత ఇపుడు పూజ హెగ్డే', 'త్రివిక్రమ్.. బుట్టబొమ్మను వదలరా' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Neha Shetty: మేము ఏది చేసినా మీ కోసమే.. హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదంపై స్పందించిన హీరో!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook